అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం
ఆమనగల్లు: అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మాడ్గుల మండలం కొల్కులపల్లి, నర్సాయిపల్లి, మాడ్గుల, రామ్‌దుగ్యాల గ్రామాలలో సోమవారం కాంగ్రెస్ మద్దతు సర్పంచ్ అభ్యర్థులకు ఎమ్మెల్యే కసిరెడ్డి ప్రచారం నిర్వహించారు. కొల్కులపల్లిలో అభ్యర్థి బట్టు అనురాధతో కలిసి భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించాలని కోరారు. గ్రామాల అభివృద్ధి, సామాజిక న్యాయం, నిరుపేదల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ బట్టు కిషన్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి సూదిని రాంరెడ్డి, నాయకులు కొండల్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, యాదయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి


