సత్తాచాటారు సర్పంచ్‌లయ్యారు
శంకర్‌పల్లి: చిన్నచిన్న సంఘటనలు మినహా ఆదివారం నిర్వహించిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. ఈఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపర్చిన కొండకల్ అభ్యర్థి ఎరుకల శేఖర్ 730 ఓట్లతో అత్యధిక మెజారిటీతో గెలుపొందగా, ఎల్వర్తి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ మద్దతుదారాలు మారెపల్లి భాగ్యలక్ష్మి 721 ఓట్లతో భారీ విజయం సాధించారు. గోపులారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తంగెడపల్లి రవీందర్‌రెడ్డి హోరాహోరీ పోరులో 10 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు.
సర్పంచు ఎన్నికపై విచారణ జరపాలి
కలెక్టర్‌కు అభ్యర్థి శ్రీనివాస్ ఫిర్యాదు
తాండూరు రూరల్: మండల పరిధి అంతారం సర్పంచు ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, వాటిపై సమగ్ర విచారణ జరపాలని సర్పంచ్ అభ్యర్థి బుడుగ జంగం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయనమాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ తరుఫున 7 వార్డులు గెలిచామని తెలిపారు. విజయం సాధించిన వారికి కౌంటింగ్ రోజు ధ్రువపత్రాలు ఇవ్వకుండా ఆర్‌ఓ నిరాకరించారని పేర్కొన్నారు. ఆ తర్వాత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే ధ్రువపత్రాలతో పాటు.. ఉప సర్పంచు ఎన్నిక నిర్వహించారని వివరించారు. ఆర్‌ఓ ప్రవర్థన సరిగ్గా లేదని,ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారనిఆరోపించారు. అలాగే ఓట్ల లెక్కింపు తుది దశ వరకు తానే గెలుపు దిశగా ఉండగా.. కేవలం 6 ఓట్ల తేడాతో ఓడిపోయారని ఆర్‌ఓ చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందని వాపోయారు. సర్పంచు ఎన్నికతో పాటు.. ఆర్‌ఓ పాత్రపైపూర్తి విచారణ చేసి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రీ కౌంటింగ్ నిర్వహించాలని కోరారు.
సత్తాచాటారు సర్పంచ్‌లయ్యారు
సత్తాచాటారు సర్పంచ్‌లయ్యారు


