ఉత్సాహంగా ‘తొలి’ ఓటు
మొదటిసారి వినియోగించుకున్న యువత
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది ఎంతో కీలకం. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ఎన్నికల సంఘం ఓటు హక్కు కల్పించింది. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మంచి నేతను ఎన్నుకునేందుకు అవకాశం రావడంతో ఉదయమే ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీశారు.
ఆనందంగా ఉంది
మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకోవడం సంతోషంగా ఉంది. ఓటు వజ్రాయుధం లాంటిది. సర్పంచ్ ఎన్నికల్లో పార్టీలకతీతంగా గ్రామాభివృద్ధికి ఎవరు పని చేస్తారో వారిని గుర్తించి ఓటు హక్కును వినియోగించుకున్నా. ఓటుహక్కుతో సర్పంచ్‌ను ఎన్నుకోవడం ఆనందంగా ఉంది.
– అభిషేక్‌గౌడ్, తాళ్లపల్లి, షాబాద్
ఓటు విలువైనది
ఓటుహక్కు వచ్చిన తరువాత తొలిసారి ఓటు వేశా. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడం ఆనందంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది. అలాంటి విలువైన ఓటును మొదటిసారి వినియోగించుకున్నా. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశాను.
– సౌమ్య, శెట్టిపల్లి, ఆమనగల్లు


