రేపు సబ్ జూనియర్, యూత్ అథ్లెటిక్స్ మీట్
హుడాకాంప్లెక్స్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 8 గంటలకు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సబ్ జూనియర్, యూత్ అథ్లెటిక్స్ మీట్–2025 నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 4 నుంచి 20 ఏళ్లలోపు బాలురు, బాలికలు 60, 80, 100, 300, 400 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షాట్‌పుట్ విభాగాల్లో పాల్గొనవచ్చని తెలిపారు. రూ.299 రుసుము చెల్లించి ఆన్‌లైన్‌లో లేదంటే గ్రౌండ్‌లో స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పారు. నమోదు కోసం ఆధార్ లేదా బర్త్ సర్టిఫికెట్ జిరాక్స్ సమర్పించాలని చెప్పారు. వివరాలకు 99630 48320, 99590 91114 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


