వైభవంగా స్వామివారి కల్యాణోత్సవం
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం స్వామివారి కల్యాణోత్సవం అత్యంత వైభభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని పచ్చని తోరణాలు, రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ విగ్రహాలను కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అనంతరం ఆలయ చైర్మన్ జిల్లెల పవన్‌కుమార్‌రెడ్డి, ఈఓ స్నేహలతల ఆధ్వర్యంలో స్వామివారి కల్యణ క్రతువును వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్‌పర్సన్ గీత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదీలాల్, పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శ్యాంసుందర్‌రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు లక్ష్మయ్య, స్వామిగౌడ్, వెంకటయ్య, యాదయ్య, జంగయ్య తదితరులు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా స్వామివారి కల్యాణోత్సవం


