ఓఆర్‌ఆర్ దాకా ఇక జీహెచ్‌ఎంసీనే
న్యూస్‌రీల్
సీఎం వ్యాఖ్యలు.. సీఎం దేవుళ్లపై అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేయడం శోచనీయమని బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు.
డీసీలకు స్థానిక సంస్థల రికార్డులు
సాక్షి, సిటీబ్యూరో: విలాసం.. మెట్రో నగరాల్లో జీవనశైలిలో భాగమైపోయింది. ఇల్లు, తిండి, దుస్తులే కాదు.. తిరిగే ప్రాంతం కూడా ఖరీదుగా, విలాసవంతంగా ఉండాల్సిందేనంటోంది యువతరం. ఫుడ్ నుంచి షాపింగ్ వరకూ ప్రతీది గ్లోబల్ బ్రాండ్లు కావాల్సిందేనంటోంది. అందుకే దేశంలోని మెట్రో నగరాలలో అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్లు రిటైల్ ఔట్‌లెట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలాసవంతమైన షాపింగ్ వీధులేంటని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ సర్వే నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 50 అత్యంత విలువైన షాపింగ్ వీధులు–2025ను ప్రకటించగా.. మన దేశం నుంచి 15 ప్రాంతాలకు చోటు దక్కింది. ఇందులో హైదరాబాద్ నుంచి బంజారాహిల్స్, హిమాయత్‌నగర్‌లు హై స్ట్రీట్స్ జాబితాలో నిలిచాయి.
48వ స్థానంలో మన హై స్ట్రీట్లు..
ప్రీమియం హై స్ట్రీట్ ఏరియాలు, మార్కెట్ ఆక్యుపెన్సీ స్థాయి, ధరలు, బ్రాండ్లు, స్థిరమైన జన సమూహం, కొనుగోలు వ్యయం, కస్టమర్ల ప్రవర్తన వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే నిర్వహించారు. లండన్‌లోని న్యూ బ్రాండ్ స్ట్రీట్ ప్రపంచంలోనే హై స్ట్రీట్‌గా నిలిచింది. ఇండియాలో అత్యంత ఖరీదైన రిటైల్ కారిడార్‌గా న్యూఢిల్లీలోని ఖాన్ మార్కెట్ నిలిచింది. ఏషియా పసిఫిక్ రీజియన్‌లోని టాప్–50 ఖరీదైన షాపింగ్ స్ట్రీట్లలో ఖాన్ మార్కెట్ 24వ స్థానంలో ఉంది. ఇక్కడ అద్దెలు చదరపు అడుగుకు 223 డాలర్లు లేదా రూ.19,940లుగా ఉన్నాయి. మన దేశం నుంచి ముంబై, బెంగళూరు నగరాల నుంచి మూడేసి హై స్ట్రీట్స్ ఉండగా.. న్యూఢిల్లీ, హైదరాబాద్, పుణె నగరాల్లో రెండు, కోల్‌కతా, చైన్నె, గుర్‌గావ్ నగరాల్లో ఒకటి చొప్పున హై స్ట్రీట్ ప్రాంతాలున్నాయి. బౌగోళిక రాజకీయ అస్థిరత, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ లగ్జరీ రిటైల్ మార్కెట్ మాత్రం తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతుండటంతో పాటు సాంకేతికత, ఆర్థిక వృద్ధి, ఈ–కామర్స్ రంగం అభివృద్ధే ఈ డిమాండ్‌కు కారణం. అత్యంత విలువైన షాపింగ్ వీధుల్లో బంజారాహిల్స్, హిమాయత్‌నగర్ ప్రాంతాలు 48వ స్థానంలో నిలిచాయి. ఈ రెండు ప్రాంతాలు ఏడాదికి అద్దె చదరపు అడుగుకు 30 డాలర్లు లేదా రూ.2,680గా ఉన్నాయి. ఏషియా పసిఫిక్ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల నుంచి స్థానం సంపాదించిన ఏకైక నగరం హైదరాబాద్ కావడం గమనార్హం.
లగ్జరీ బ్రాండ్ల టెస్టింగ్ ఇక్కడే..
జీవనశైలి, డిజైన్ ఆధారిత దుకాణాలు బంజారాహిల్స్ బాగా ఫేమస్. మరోవైపు హిమాయత్‌నగర్ నమ్మకమైన రిపీటెడ్ కస్టమర్లతో విలువ ఆధారిత లేబుల్స్‌కు పెట్టింది పేరు. బంజారాహిల్స్ ప్రశాంతమైన కేఫ్‌లతో కూడిన వాతావరణంతో ప్రసిద్ధి చెందింది.
సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి
కందుకూరు: ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను బుధవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ఎఫ్‌సీడీఏ కమిషనర్ శశాంకతో కలిసి పరిశీలించారు. నిర్ధేశించిన పనులు ఏ మేరకు పూర్తయ్యాయని సంబంధిత అధికారులను అడిగితెలుసుకున్నారు. త్వరగా పనులు పూర్తి చేయాలని సూచించారు. సమ్మిట్‌కు రానున్న అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఏడీజీ మహేష్ భగవత్
కందుకూరు: గ్లోబల్ సమ్మిట్‌కు పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేయాలని అదనపు డీజీ మహేష్ భగవత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన రాచకొండ సీపీ సుధీర్‌బాబు, ఐజీపీ రమేష్‌రెడ్డితో కలిసి గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. అనంతరం పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి సలహాలు, సూచనలు ఇచ్చారు. బందోబస్తు విషయంలో పొరపాట్లకు తావివొద్దని, అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌కు లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులతో పాటు స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. వీఐపీ ప్రతినిధుల చుట్టూ మూడంచెల భద్రత, వెయ్యికి పైగా సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుందని చెప్పారు. సమ్మిట్ జరిగే రోజుల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
దివ్యాంగుల వనరుల జిల్లా అధికారి రమేశ్
షాద్‌నగర్‌రూరల్: దివ్యాంగ విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని దివ్యాంగుల వనరుల జిల్లా అధికారి రమేశ్ అన్నారు. పట్టణంలోని ఎంఆర్‌సీ భవనంలో ఎంఈఓ మనోహర్ అధ్యక్షత బుధవారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు, ఉపాధ్యాయులకు, భవిత కేంద్రాల్లోని విద్యార్థులకు మండల స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. దివ్యాంగ చిన్నారులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. దివ్యాంగ విద్యార్థులు వారానికి రెండు సార్లు విధిగా ఫిజియోథెరపీ చేయించుకోవాలని సూచించారు. సదరం ధ్రువపత్రాలు తీసుకుంటే ప్రభుత్వ ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చని చెప్పారు. అనంతరం విజేతలకు బహుమతులను అందజేశారు. ఈకార్యక్రమంలో అధికారులు వెంకటేశ్, రమేశ్, ఉపాధ్యాయులు స్వప్న, శివకుమార్, స్రవంతి, వెంకటేశం, ఈశ్వర్, రమాదేవి, సరిత తదితరులు పాల్గొన్నారు.
ఎన్‌పీఆర్‌డీ సంఘం జిల్లా అధ్యక్షుడు భుజంగరెడ్డి
షాద్‌నగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి భుజంగరెడ్డి డిమాండ్ చేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన భుజంగరెడ్డి మాట్లాడుతూ.. సమాజం దివ్యాంగులను బాధితులుగా కాకుండా సమాజంలో భాగస్వామ్యులుగా గుర్తించాలన్నారు. దివ్యాంగులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వాలు గుర్తిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రమోద్, శంకర్, మూర్తి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
అగ్నివీర్ పాసింగ్ అవుట్ పరేడ్ బుధవారం గోల్కొండ ఆర్టిలరీ సెంటర్‌లోని పళని పరేడ్ గ్రౌండ్‌లో అత్యంత ఘనంగా జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న అగ్నివీర్ 6వ బ్యాచ్ పరేడ్‌ను ఆర్టిలరీ సెంటర్ డైరెక్టర్ జనరల్ అథోష్ కుమార్ వీక్షించారు. అంతకు ముందు ఆయన ఆర్టిలరీ సెంటర్‌లోని వార్ మెమోరియల్ వద్ద దేశం కోసం పోరాడుతూ అమరులైన సైనికులకు నివాళులర్పించారు. –గోల్కొండ
అదరహో.. అగ్నివీర్
నగర ముఖచిత్రం మారింది. నయా బల్దియాకు దారి పడింది. శివార్లలోని 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీలో విలీనం కావడంతో సదరు స్థానిక సంస్థలకు సంబంధించిన రికార్డులు, బాధ్యతలు జీహెచ్‌ఎంసీ పరిధిలోకొచ్చాయి. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. జీహెచ్‌ఎంసీలోని ఏ డిప్యూటీ కమిషనర్ ఏ స్థానికసంస్థ రికార్డులు స్వాధీనం చేసుకోవాలో పేర్కొంటూ.. తక్షణమే ఆ పని పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ స్థానిక సంస్థల్ని విలీనం చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో వెంటనే చర్యలు చేపట్టారు. ఈ స్థానికసంస్థల రికార్డుల్ని స్వాధీనం చేసుకోవడంతోపాటు మినిట్స్ బుక్స్ నిలిపివేయాలని, ప్రస్తుత బ్యాంకు ఖాతాలను జీహెచ్‌ఎంసీ బ్యాంక్ ఖాతా (అకౌంట్ నెంబర్ (52082155599)కు బదిలీ చేయాలని ఆయన ఆదేశించారు. –సాక్షి, సిటీబ్యూరో
నయా బల్దియా!
మారిన నగర ముఖ చిత్రం
ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్లుగా స్థానిక సంస్థల కమిషనర్లు
సిబ్బంది వివరాలివ్వండి
ఔటర్ వరకున్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జీహెచ్‌ఎంసీలో విలీనం కావడంతో వాటిలో పని చేస్తున్న సిబ్బందికి సంబంధించిన వివరాలు అందజేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ మున్సిపల్ పరిపాలనశాఖ కమిషనర్‌ను కోరారు. సదరు స్థానిక సంస్థలకు మంజూరైన మొత్తం పోస్టులెన్ని.. ప్రస్తుతం ఎందరున్నారు.. వారిలో రెగ్యులర్‌తో పాటు ఔట్‌సోర్సింగ్, ఎన్‌ఎంఆర్‌ల వివరాలు కూడా పొందుపరచాలని సూచించారు.
బోర్డుల మార్పు
● 27 స్థానిక సంస్థల కార్యాలయాలపై జీహెచ్‌ఎంసీ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో పాటు దిగువ వివరాలు సమర్పించాలని సూచించారు.
● స్థానిక సంస్థ ప్రొఫైల్.
● మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్‌లో పని చేస్తున్న ఉద్యోగుల వివరాల జాబితా.
● స్థిర, చర ఆస్తుల వివరాలు
● బ్యాంకు డిపాజిట్లు, పెట్టుబడులు
● ట్యాక్స్‌లు, నాన్ ట్యాక్స్‌లకు సంబంధించి. డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్ వివరాలు.
● అమలవుతున్న స్కీమ్‌లు
● పనులు, సామగ్రికి సంబంధించి చెల్లించాల్సిన బిల్లులు
● గత మూడేళ్లలో జారీ చేసిన భవననిర్మాణ, లే ఔట్‌ల అనుమతులు.
● వీటిని సంబంధిత ప్రొఫార్మా రూపంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేరకు వెంటనే సమర్పించాలని ఆదేశించారు.
● ఈ విలీన ప్రక్రియలో సహకరించాల్సిందిగా 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల కమిషనర్లను జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ కోరారు. ఈ పనులు ఈ నెల 5వ తేదీలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. పర్యవేక్షణాధికారులుగా ఆయా జోనల్ కమిషనర్లకు బాధ్యతలప్పగించారు. ఓఆర్‌ఆర్ వరకు, ఓఆర్‌ఆర్‌ను ఆనుకుని ఉన్న ప్రాంతాల వరకు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్‌గా పేర్కొంటూ జీహెచ్‌ఎంసీ పరిధి విస్తరణతో నగర అభివృద్ధి ప్రణాళికలు సమగ్రంగా అమలు చేసేందుకు అవకాశం లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
ఈ వివరాలు ఇవ్వాలి
ఆయా ప్రొఫార్మాల మేరకు సదరుస్థానిక సంస్థల్లో నివాసాలు, వార్డులు, స్లమ్స్, జనాభా, గత మూడేళ్లలో ఆదాయం(గ్రాంట్స్‌తో సహ), వ్యయం, రోడ్లు, డ్రెయిన్లు, వీధిదీపాలు, తాగునీటి సరఫరా వివరాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, మార్కెట్లు, శ్మశాన వాటికలు, కమ్యూనిటీ హాళ్లు పరిశ్రమలు, చెత్త డంపింగ్ ప్రాంతాలు, భవనాలు, ఖాళీ ప్రదేశాలు, పార్కులు, స్థానికసంస్థకు చెందిన వాహనాలు, ఫర్నిచర్, దుకాణాలు, సెల్ప్‌హెల్ప్ గ్రూప్‌లు, స్వచ్ఛందసంస్థలు, కాలనీ అసోసియేషన్లు, ఎన్జీవోలు, ఇటీవల నియమించిన ఔట్‌సోర్సింగ్ కార్మికులు తదితరాలు. సంవత్సర క్యాష్‌బుక్స్, పేబిల్స్ పరిశీలించాలని సూచించారు.
విలీనమిలా..
రాష్ట్ర మంత్రిమండలి తీసుకున్న విలీన నిర్ణయాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. విస్తీర్ణం, జనాభా పెరుగుదల: దీంతో ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న జీహెచ్‌ఎంసీ దాదాపు 2000 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. జనాభా దాదాపు 1.3 కోట్లు ఉన్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ పేర్కొన్నారు.
ముంబై ఇలా ..
● 1865: మున్సిపల్ పరిపాలన బాంబే మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో ప్రారంభం
● 1888: బాంబే మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ద్వారా అధికారికంగా ఏర్పడింది
● 1990లలో: బాంబే ముంబైగా మారడంతో బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)గా పేరు మారింది.
● గ్రేటర్ ముంబై పరిధిలోని అన్ని ప్రాంతాలను కలిపి ఒకే కార్పొరేషన్. మున్సిపాలిటీల విలీనంతో ఏర్పడిన దీనిని ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై (ఎంసీజీఎం) అని కూడా పిలుస్తున్నారు.
● ప్రస్తుత పరిధి 603 చ.కి.మీ. జనాభా 2.2 కోట్లు (అంచనా)
● ఐఏఎస్ అధికారి కమిషనర్ ఆధ్వర్యంలో పని చేస్తోంది.
హైదరాబాద్ ఇలా..
జీహెచ్‌ఎంసీ అంతకు ముందు ఎంసీహెచ్‌గా ఉండేది. 12 మున్సిపాలిటీలతో ఏర్పడింది. ప్రస్తుతం 27 స్థానికసంస్థలు విలీనం కావడంతో ముంబై మాదిరిగా గ్రేటర్ అర్బన్ బాడీగా మారింది. విస్తరించిన ప్రాంతం వరకు తెలంగాణ అర్బన్ కోర్ రీజియన్ (టీక్యూర్)గా పిలుస్తున్నారు. జనాభా 1.3 కోట్ల నుంచి 1.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. విస్తీర్ణం దాదాపు 2వేల చదరపు కిలోమీటర్లు. ఐఏఎస్ అధికారి నేతృత్వంలోనే పని చేస్తోంది.
ప్రపంచ నగరాల సరసన..
జనాభా పెరుగుదలతో హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచంలోని పెద్ద నగరాల సరసన చేరే దశకు చేరుకుంది. ప్రపంచంలోని కొన్ని పెద్దనగరాలు. వాటి జనాభా దాదాపుగా. పాలన విభాగం వివరాలిలా.
ఏషియా పసిఫిక్ రీజియన్‌లో ఈ ప్రాంతాలకు చోటు
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన షాపింగ్ వీధులు
48వ స్థానంలో నిలిచిన బంజారాహిల్స్, హిమాయత్‌నగర్
కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ నివేదికలో వెల్లడి
ఏషియా పసిఫిక్ రీజియన్‌లో ఇండియాలోని హై స్ట్రీట్లు ఇవే
హై స్ట్రీట్ ర్యాంక్
ఖాన్ మార్కెట్, న్యూఢిల్లీ 24
కన్నాట్ ప్లేస్, న్యూఢిల్లీ 26
గల్లెరియా మార్కెట్, గుర్‌గావ్ 26
లింకింగ్ రోడ్, ముంబై 34
పార్క్ స్ట్రీట్, కోల్‌కతా 36
ఫోర్ట్/ఫౌంటేన్, ముంబై 39
కెంప్స్ కార్నర్, ముంబై 40
బ్రిగేడ్ రోడ్, బెంగళూరు 41
విట్టల్ మల్యా రోడ్, బెంగళూరు 42
ఎంజీ రోడ్, పుణె 44
ఇంద్రానగర్ 100 ఫీట్ రోడ్,
బెంగళూరు 45
ఎఫ్‌సీ రోడ్, పుణె 46
బంజారాహిల్స్, హైదరాబాద్ 48
హిమాయత్‌నగర్, హైదరాబాద్ 48
పాండీ బజార్, చైన్నె 50
మెట్రోపాలిటన్ ప్లానింగ్, సమర్థమైన పాలన కోసం ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
ఏ జోనల్ కమిషనర్ పర్యవేక్షణలో ఏవి
చార్మినార్: ఆదిభట్ల, బడంగ్‌పేట్, జల్‌పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్.
శేరిలింగంపల్లి: బండ్లగూడ జాగీర్, మణికొండ, నార్సింగి, అమీన్‌పూర్, తెల్లాపూర్.
ఎల్‌బీనగర్: మీర్‌పేట్, పెద్ద అంబర్‌పేట్, తుక్కుగూడ, దమ్మాయిగూడ, ఘట్‌కేసర్, పీర్జాదిగూడ, పోచారం.
కూకట్‌పల్లి: దుండిగల్, గుండ్ల పోచంపల్లి, కొంపల్లి, మేడ్చల్, నిజాంపేట్, బొల్లారం.
సికింద్రాబాద్: బోడుప్పల్, జవహర్‌నగర్, నాగారం, తూముకుంట.
రికార్డులు స్వాధీనం ఏ స్థానిక సంస్థది.. ఏ డిప్యూటీ కమిషనర్‌కు.. వివరాలిలా..
స్థానికసంస్థ డిప్యూటీ కమిషనర్
పెద్ద అంబర్‌పేట్ హయత్‌నగర్
జల్‌పల్లి చాంద్రాయణగుట్ట
శంషాబాద్ రాజేంద్రనగర్
తుర్కయాంజాల్ సంతోష్‌నగర్
మణికొండ కార్వాన్
నార్సింగి మెహదీపట్నం
ఆదిభట్ల మలక్‌పేట్
తుక్కుగూడ ఎల్‌బీనగర్
మేడ్చల్ అల్వాల్
దమ్మాయిగూడ కాప్రా
నాగారం మల్కాజిగిరి
పోచారం ముషీరాబాద్
ఘట్‌కేసర్ ఉప్పల్
గుండ్లపోచంపల్లి యూసుఫ్‌గూడ
తూముకుంట సికింద్రాబాద్
కొంపల్లి కుత్బుల్లాపూర్
దుండిగల్ గాజులరామారం
బొల్లారం చందానగర్
తెల్లాపూర్ శేరిలింగంపల్లి
అమీన్‌పూర్ పటాన్‌చెరువు
బడంగ్‌పేట్ చార్మినార్
బండ్లగూడ జాగీర్ ఖైరతాబాద్
మీర్‌పేట్ సరూర్‌నగర్
బోడుప్పల్ అంబర్‌పేట్
పీర్జాదిగూడ గోషామహల్
జవహర్‌నగర్ బేగంపేట్
నిజాంపేట్ కూకట్‌పల్లి
ప్రపంచంలోని కొన్ని పెద్దనగరాలు..
నగరం పరిపాలన విభాగం విస్తీర్ణం (చ.కి.మీ)
టోక్యో టోక్యో మెట్రోపాలిటన్ 2,194
మెక్సికో సిటీ సీడీఎంఎక్స్ 1,485
షాంఘై మున్సిపల్ గవర్నమెంట్ 6,340
బీజింగ్ మున్సిపల్ గవర్నమెంట్ 16,410
కై రో గవర్నరేట్ 3,085
నగరం జనాభా పరిపాలన
టోక్యో (జపాన్) 3.7 కోట్లు టోక్యో మెట్రోపాలిటన్ గవర్నమెంట్
ఢిల్లీ (ఇండియా) 3.4 కోట్లు మున్సిపల్ కార్పొరేషన్లు+రాష్ట్ర ప్రభుత్వం
షాంఘై (చైనా) 3.0 కోట్లు మేయర్+ పీపుల్స్ కాంగ్రెస్
ఢాకా (బంగ్లాదేశ్) 2.4 కోట్లు నార్త్+ సౌత్‌సిటీ కార్పొరేషన్లు
ముంబై (ఇండియా) 2.2 కోట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్
హైదరాబాద్ (ఇండియా) 1.5కోట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
ఓఆర్‌ఆర్ దాకా ఇక జీహెచ్‌ఎంసీనే
ఓఆర్‌ఆర్ దాకా ఇక జీహెచ్‌ఎంసీనే
ఓఆర్‌ఆర్ దాకా ఇక జీహెచ్‌ఎంసీనే
ఓఆర్‌ఆర్ దాకా ఇక జీహెచ్‌ఎంసీనే
ఓఆర్‌ఆర్ దాకా ఇక జీహెచ్‌ఎంసీనే
ఓఆర్‌ఆర్ దాకా ఇక జీహెచ్‌ఎంసీనే


