సీఎం వ్యాఖ్యలు అభ్యంతరకరం
మీర్‌పేట: రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి హిందూ దేవుళ్లపై అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యలు చేయడం శోచనీయమని బీజేపీ మీర్‌పేట కార్పొరేషన్–1, 2 అధ్యక్షులు పసునూరి భిక్షపతిచారి, ముఖేశ్ ముదిరాజ్ అన్నారు. సీఎం వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం మీర్‌పేట ప్రధాన రహదారిపై బీజేపీ నాయకులు ధర్నా చేపట్టి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవల జూబ్లీహిల్స్ ఉప ఉన్నికల్లోనూ ఓ వర్గంవారి ఓట్ల కోసం ముఖ్యమంత్రి దిగజారి మాట్లాడారని, రాష్ట్రంలోని హిందువులంతా ఏకమై కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సీఎం అహంకారాన్ని తగ్గించుకుని వెంటనే హిందువులకు క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ధర్నాలో పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యుడు సోమేశ్వర్, ప్రధాన కార్యదర్శి రవినాయక్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవేందర్‌ముదిరాజ్, నాయకులు మధు, భీంరాజ్, కృష్ణారెడ్డి, ప్రభాకర్, హైందవి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
క్షమాపణ చెప్పాలని బీజేపీ నేతల డిమాండ్


