ముగిసిన నామినేషన్ల పరిశీలన
రెండు పత్రాల తిరస్కరణ
ఆమనగల్లు: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ బుధవారం ముగిసింది. ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల కోసం 3 రోజులుగా ఎన్నికల అధికారులు స్వీకరించారు. సర్పంచ్, వార్డు సభ్యులకు దాఖలైన నామినేషన్లను ఎంపీడీఓలు కుసుమమాధురి, సుజాత, శ్రీకాంత్‌లు పరిశీలించారు. నామినేషన్ల పరిశీలన అనంతరం సక్రమంగా ఉన్న నామినేషన్ వివరాలను ఆయా కేంద్రాల వద్ద ప్రదర్శించారు. ఆమనగల్లు మండలంలో 13 సర్పంచ్ పదవులకు 86 నామినేషన్లు, 112 వార్డు సభ్యులకు 336 దాఖలవ్వగా అన్ని సక్రమంగానే ఉన్నట్లు ప్రకటించారు. కడ్తాల్ మండలంలో 24 సర్పంచ్ పదవులకు 153, 210 వార్డు సభ్యులకు 703 నామినేషన్లు వచ్చాయి. ఇందులో వాస్‌దేవ్‌పూర్ సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిన పాత్లావత్ లక్ష్మణ్ నామినేషన్‌ను తిరస్కరించారు. ఈజీఎస్‌లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండటంతో లక్ష్మణ్ నామినేషన్‌ను తిరస్కరించారు. తలకొండపల్లి మండలంలో 32 సర్పంచ్ పదవులకు 205 నామినేషన్లు, 272 వార్డు సభ్యులకు 742 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా వార్డు సభ్యుడు పదవి కోసం వెంకటాపూర్‌తండాలో మూడావత్ భాస్కర్ నామినేషన్ వేయగా ప్రతిపాదితుడు మరోవార్డు చెందిన వ్యక్తి కావడంతో నామినేషన్‌ను తిరస్కరించారు. బలుసులపల్లి సర్పంచ్ పదవికి ఒకే నామినేషన్ రావడంతో సర్పంచ్‌గా విజయపాత్లావత్ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. అలాగే వార్డు సభ్యులు కూడా ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవం కానున్నారు.


