అదృష్టం వరించి.. అభివృద్ధిని కాంక్షించి
ఆమనగల్లు: మండలంలోని కోనాపూర్ సర్పంచ్‌గా శ్రీలత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వ్ అయ్యింది. గ్రామంలో ఇద్దరే మహిళా ఎస్టీ ఓటర్లు ఉన్నారు. ఇందులో శ్రీలత సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసింది. ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.
రేఖ్యతండా, గోవిందాయిపల్లి తండాలు ఏకగ్రీవం
కడ్తాల్: మండల పరిధిలోని రేఖ్యతండా, గోవిందాయిపల్లి తండా సర్పంచ్ పదవులు ఎస్టీ మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఆయా పంచాయతీల్లోని పెద్దలు అంతా కలిసి రాజకీయాలకతీతంగా.. అభివృద్ధిలో భాగంగా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని చర్చించుకున్నారు. ఈ మేరకు రేఖ్యతండా సర్పంచ్ అభ్యర్థిగా పాత్లావత్‌త్ లక్ష్మి , గోవిందాయిపల్లి తండా సర్పంచ్ అభ్యర్థిగా సభవట్ జాను ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేఖ్యతండా పంచాయతీ పరిధిలోని 8 వార్డు స్థానాలకు సైతం ఒక్కొక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవమయ్యారు. అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఏకగ్రీవమైన పలు పంచాయతీలు
అదృష్టం వరించి.. అభివృద్ధిని కాంక్షించి
అదృష్టం వరించి.. అభివృద్ధిని కాంక్షించి


