డబ్ల్యూటీఐటీసీ జాయింట్ సెక్రటరీగా రాహుల్ రెడ్డి
లక్డీకాపూల్: ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (డబ్ల్యూటీఐటీసీ) ఇంటర్నేషనల్ స్టూడెంట్ చాప్టర్ జాయింట్ సెక్రటరీగా చుక్కా రాహుల్ రెడ్డి నియమితులయ్యారు. డబ్ల్యూటీఐటీసీ గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం మేరకు ఈ నియామకం జరిగింది. ఖండాలకు అతీతంగా తెలుగు విద్యార్థులు, ఆవిష్కర్తలు, ఔత్సాహిక నిపుణులను అనుసంధానించే డబ్ల్యూటీఐటీసీ లక్ష్యాన్ని ఈ నియామకం మరింత బలోపేతం చేస్తుందని కౌన్సిల్ పేర్కొంది. ఈ సందర్భంగా డబ్ల్యూటీఐటీసీ చైర్మన్ సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ: ‘రాహుల్ రెడ్డి గ్లోబల్ తెలుగు నాయకత్వానికి కొత్త తరం ప్రతినిధి. ఆవిష్కరణలు, అంట్రప్రెన్యూర్‌షిప్‌పై ఆయనకున్న అంకితభావం, విద్యార్థులను ప్రోత్సహించే తత్వం ఆయన్ను గ్లోబల్ స్టూడెంట్ కమ్యూనిటీకి నాయకత్వం వహించడానికి సరైన వ్యక్తిగా నిలబెట్టాయన్నారు. దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో జరిగే డబ్ల్యూటీఐటీసీ 2025 సదస్సులో ఆయన బాధ్యతలు చేపడతారన్నారు. దీంతో పాటు ’గ్లోబల్ స్టూడెంట్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్’ను ప్రారంభించనున్నట్టు తెలిపారు. తన నియామకంపై రాహుల్ రెడ్డి స్పందిస్తూ: ‘డబ్ల్యూటీఐటీసీ ఇంటర్నేషనల్ స్టూడెంట్ చాప్టర్ జాయింట్ సెక్రటరీగా ఎంపిక కావడం గౌరవంగా భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు విద్యార్థులను అనుసంధానించడం, వారికి అంతర్జాతీయ అవకాశాలు కల్పించడం, బలమైన ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడం తమ లక్ష్యమన్నారు. దుబాయ్ వేదికగా జరగబోయే సదస్సు విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలను కల్పిస్తుందన్నారు.


