గీతతో వ్యక్తిత్వ వికాసం
అనంతగిరి: భగవద్గీత సర్వ మానవాళికి శిరోధార్యమని, ఆచరణాత్మక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మానవ ధర్మ శాస్త్రమని కాళోజీ పురస్కార గ్రహీత గంటా మనోహర్ రెడ్డి అన్నారు. కమలానగర్‌లోని శ్రీమహాలక్ష్మి ఆలయంలో సోమవారం రాత్రి పద్య పదభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన గీతా జయంతి కార్యక్రమానికి ఆయన ప్రధాన వక్తగా ప్రసంగించారు. భారతీయ జీవన విధానం సనాతన ధర్మం పై ఆధారపడి కొనసాగిందన్నారు హృదయాంతరంగ ప్రేరణ రామాయణం అని, మేధో మదన భరితం మహాభారతం అని, భగవద్గీత ఉన్నచోట భయానికి, సంశయానికి, అనవసరమైన ఆవేశానికి తావుండదన్నారు. అన్ని సమస్యలకు ఏకై క పరిష్కారం భగవద్గీత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షుడు బందప్పగౌడ్, మాజీ కౌన్సిలర్ అనంతరెడ్డి, పద్య పదభారతి ఉపాధ్యక్షుడు విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి డాక్టర్ మున్నూరు రాజు, సహకార్యదర్శి సుధాకర్ గౌడ్, కోశాధికారి రెడ్యా రాథోడ్, కార్యవర్గ సభ్యులు శ్రీనివాసాచారి, దివాకర శాస్త్రి, నవీన్, ఉదయరావు, సతీశ్‌గౌడ్, రమేశ్, సుభాష్ రెడ్డి, శ్రీలత రెడ్డి, విజయలక్ష్మి, విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
కాళోజీ పురస్కార గ్రహీత మనోహర్ రెడ్డి


