పకడ్బందీగా నామినేషన్ల ప్రక్రియ
నవాబుపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు షేక్ యాస్మిన్ బాషా పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని నవాబుపేట, ఎక్ మామిడి గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. సర్పంచ్, వార్డు స్థానాల నోటిఫికేషన్ వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. నామినేషన్ సెంటర్ల వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి అవసరమైన వారికి సహకరించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి తప్పకుండా అమలయ్యేలా చూడాలన్నారు. నిర్ణీత గడువు లోపు నామినేషన్లు స్వీకరించేందుకు టోకెన్లు జారీ చేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఖర్చుల వివరాలపై అవగాహన కల్పించాలన్నారు. వ్యయ పరిమితిని పక్కాగా లెక్కించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ వాసుచంద్ర, డిప్యూటీ కలెక్టర్ పూజ, తహసీల్దార్ బుచ్చయ్య, ఎంపీడీఓలు నవీన్‌కుమార్, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల పరిశీలకులు షేక్ యాస్మిన్ బాషా


