సిమెంట్ ట్యాంకర్ బోల్తా
శంకర్‌పల్లి: సిమెంటు లోడ్‌తో వెళ్తున్న ట్యాంకర్(లారీ) బోల్తా పడిన సంఘటన శంక్‌పల్లి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు నుంచి సిమెంటు లోడుతో వస్తున్న ట్యాంకర్ శంకర్‌పల్లి మీదుగా బాచుపల్లి వెళ్తోంది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఎల్వర్తి మూలమలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ట్యాంకర్ రోడ్డుకు అడ్డంగా పడటంతో, వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సోమవారం పోలీసులు క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు.
అశోక్‌కే నా మద్దతు..
● స్పష్టం చేసిన మాజీ సర్పంచ్
● కొలిక్కి వచ్చిన కరన్‌కోట్ ‘పంచాయితి’
తాండూరు రూరల్: రెండు రోజులుగా ఉత్కంఠ నెలకొన్న కరన్‌కోట్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిత్వంపై స్పష్టత వచ్చింది. బీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి బోయ అశోక్‌కుమార్‌కు తన మద్దతు ఉంటుందని మాజీ ఉప సర్పంచ్ హేమంత్‌కుమార్ స్పష్టం చేశారు. సోమవారం తాండూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నామినేషన్ వేయలేదని చెప్పారు. అశోక్ గెలుపు కోసం గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేస్తానన్నారు. మా హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరిస్తానని పేర్కొన్నారు. 600 ఉన్న రేషన్ కార్డులను 2 వేలు చేశామమని, 300 ఏళ్లక్రితం నాటి సంగమేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. గ్రామంలో ప్రతి వార్డుల్లో సీసీరోడ్లు, మురుగు కాల్వలు, స్మశాన వాటికలకు ప్రహరీలు నిర్మించామని వివరించారు. ఇందులో సుధాకర్‌గౌడ్ స్వామి, రవిందర్‌రెడ్డి, అఫ్రోజ్‌లు ఉన్నారు.


