ఇన్‌చార్జి కమిషనర్‌గా సత్యనారాయణ రెడ్డి
తుర్కయంజాల్: మున్సిపాలిటీ ఇన్‌చార్జి కమిషనర్‌గా ఇబ్రహీంపట్నం కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. మున్సిపల్ పరిధిలోని కాలనీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన కె. అమరేందర్ రెడ్డి నవంబర్ 30న ఉద్యోగ విరమణ చేసిన విషయం తెలిసిందే.
ఇబ్రహీంపట్నం: శేరిగూడ గ్రామంలోని ఉప్పరిగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాన్ని నాబార్డ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీజీఎం డా. అజయ్ కే సూద్ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ నిర్వహణ, లావాదేవీలు, పనితీరు ఎలా ఉందో పరిశీలించారు. పీఏసీఎస్ చైర్మన్ పాడురంగారెడ్డి, సీఈవో గణేశ్ ఆయనకు ఆయా విషయాలను వివరించారు. కార్యక్రమంలో టీఎస్‌సీఏబీ ఎండీ వైకే రావు, జీఎం ప్రభాకర్‌రెడ్డి, డీజీఎం కిరణ్‌కుమార్, సంబంధిత అధికారి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.
మొయినాబాద్‌రూరల్: గ్రామాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను తప్పనిసరి పాటించాలని రాజేంద్రనగర్ డీసీపీ యోగేష్‌గౌతమ్ అన్నారు. మండల పరిధిలోని బాకారం క్లస్టర్ సెంటర్‌ను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లు, నియమనిబంధనల అమలుపై సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల ఏసీపీ కిషన్, మొయినాబాద్ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్‌ఐ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
డోర్నకల్: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లోని చర్చి కాంపౌండ్ గ్రౌండ్‌లో మూడ్రోజుల పాటు నిర్వహించిన 69వ ఎస్‌జీఎఫ్ అండర్–17 బాలబాలికల రాష్ట్రస్థాయి రగ్బీ పోటీల్లో రంగారెడ్డి జట్టు విజేతగా నిలిచింది. ఉమ్మడి పది జిల్లాల జట్లు పాల్గొన్న రగ్బీ పోటీల్లో చివరి రోజు ఫైనల్‌లో బాలుర విభాగంలో రంగారెడ్డి మొదటి స్థానం, నల్లగొండ రెండో స్థానం, మెదక్ మూడో స్థానంలో నిలిచాయి. బాలికల విభాగంలో రంగారెడ్డి మొదటి, మహబూబ్‌నగర్ రెండో స్థానం, మెదక్ మూడో స్థానానికి పరిమితమయ్యాయి. డోర్నకల్ డయాసిస్ బిషప్ డాక్టర్ కె.పద్మారావు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించిన పీఈడీలు రవికుమార్, విజయచందర్‌ను బిషప్ అభినందించారు. కార్యక్రమంలో టోర్నమెంట్ పరిశీలకులు యూనూస్‌పాషా, శ్రీనివాసులు, సెయింట్ ఆగ్నేస్ పాఠశాల కరస్పాండెంట్ ఆంటోని పసాల, ఉపాధ్యాయ సంఘాల నాయకులు వెంపటి సీతారాములు, తలారి విద్యాసాగర్, పీఈడీలు పాల్గొన్నారు.
రాయదుర్గం: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నూతన సంవత్సరం వేడుకలను పురస్క రించుకొని, డిసెంబర్ 31న వివిధ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలు, కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈవెంట్లకు సంబంధించి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఈనెల 21 లోపే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారు.
ఇన్‌చార్జి కమిషనర్‌గా సత్యనారాయణ రెడ్డి
ఇన్‌చార్జి కమిషనర్‌గా సత్యనారాయణ రెడ్డి


