సర్పంచ్‌లకు
1,775
407,
వార్డులకు
ఆమనగల్లు: రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం రెండో రోజు నామినేషన్ల పర్వం కొనసాగింది. కందుకూరు, చేవెళ్ల డివిజన్లలో సోమవారం సర్పంచ్‌లకు 407, వార్డు సభ్యుల కోసం 1,175 నామినేషన్లు దాఖలయ్యాయి. కందుకూరు డివిజన్ పరిధిలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల మండలాలకు సంబంధించి సర్పంచ్ పదవులకు 157 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు మెంబర్ పదవులకు 635 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. ఆమనగల్లు మండలంలో సర్పంచ్ పదవులకు 26, వార్డు సభ్యులకు 91 నామినేషన్లు వచ్చినట్లు ఎంపీడీఓ కుసుమమాధురి తెలిపారు. తలకొండపల్లి మండలంలో సర్పంచ్ పదవులకు 77, వార్డు సభ్యులకు 286 దాఖలైనట్లు ఎంపీడీఓ శ్రీకాంత్ తెలిపారు. కడ్తాల మండలంలో సర్పంచ్ పదవులకు 56, వార్డు సభ్యులకు 258 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీఓ సుజాత తెలిపారు.
చేవెళ్ల డివిజన్‌లో..
చేవెళ్ల: డివిజన్‌లోని నాలుగు మండలాల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వచ్చాయి. సర్పంచ్ స్థానాలకు 250, వార్డు సభ్యులకు 1,140 దాఖలైనట్లు అధికా రులు తెలిపారు. చేవెళ్లలో సర్పంచులకు 58, వార్డు సభ్యులకు 294, శంకర్‌పల్లిలో సర్పంచులకు 53, వార్డు సభ్యులకు 273, మొయినాబాద్‌లో సర్పంచులకు 32, వార్డు సభ్యులకు 209, షాబాద్‌లో సర్పంచులకు 107, వార్డు సభ్యులకు 364 వచ్చాయి.
రెండో విడత, రెండో రోజు కొనసాగిన నామినేషన్లు
కందుకూరు డివిజన్‌లో సర్పంచులకు 157, వార్డు సభ్యులకు 635
చేవెళ్ల డివిజన్‌లో సర్పంచులకు 250, వార్డు సభ్యులకు దాఖలైనవి 1,140


