ఫార్మా ప్లాట్ల డాక్యుమెంట్లు సిద్ధం
యాచారం: ఫార్మా ప్లాట్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను రైతులకు పంపిణీ చేయడానికి అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. యాచారం, కందుకూరు మండలాల పరిధిలో ఫార్మాసిటీకి భూములు ఇచ్చిన రైతులకు మీర్‌ఖాన్‌పేట రెవెన్యూ పరిధిలో 620 ఎకరాల్లో అన్ని హంగులతో టీజీఐఐసీ వెంచర్‌ను అభివృద్ధి చేసింది. రైతులు ఇచ్చిన భూముల ప్రకారం 60, 121, 181, 242, 302, 363, 484, 544 గజాల చొప్పున ప్లాట్లు చేశారు. రైతులకు ఇచ్చిన ఫార్మా ప్లాట్ల సర్టిఫికెట్ల ప్రకారం అభివృద్ధి చేసిన వెంచర్‌లో గత జూలైలో లాటరీ తీసి కబ్జాలు చూపించారు. ప్లాట్ల నంబర్ల ప్రకారం డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు చేశారు.
పంపిణీకి అధికారుల ఏర్పాట్లు
ఫార్మా ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేసిన అధికార యంత్రాంగం డాక్యుమెంట్లను మాత్రం ఇప్పటికీ రైతులకు ఇవ్వలేదు. ఎప్పుడిస్తారని వారు అధికారుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 8, 9 తేదీల్లో మీర్‌ఖాన్‌పేటలో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం చేతుల మీదుగా పంపిణీ !


