గుర్తుతెలియని వాహనం ఢీ..
● ఫీల్డ్ అసిస్టెంట్‌కు తీవ్రగాయాలు
● పరిస్థితి విషమం
యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. యాచారం సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. గునుగల్ గ్రామానికి చెందిన ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ రమేశ్ మంగళవారం మధ్యాహ్నం విధులు ముగించుకుని బైక్‌పై గునుగల్ గేట్ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. రోడ్డు దాటుతున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన కుడి కాలు నుజ్జునుజ్జయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దివ్యాంగుడైన రమేశ్‌కు కుడి కాలుకు తీవ్రంగా గాయం కావడంతో కదల్లేని స్థితిలో ఉన్నాడు. రమేశ్‌ను ఢీకొట్టిని వాహనాన్ని గుర్తించేందుకు యాచారం పోలీసులు గునుగల్ గేటు వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాద విషయాన్ని డీఆర్‌డీఓ శ్రీలత దృష్టికి తీసుకెళ్లామని.. ప్రభుత్వ నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని యాచారం ఎంపీడీఓ రాధారాణి తెలిపారు.


