మృతురాలి కుటుంబానికి పరిహారం
అందజేసిన స్పీకర్ ప్రసాద్‌కుమార్
అనంతగిరి: మీర్జాగూడ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వికారాబాద్‌కు చెందిన తారిబాయి ఇంటిని మంగళవారం స్పీకర్ ప్రసాద్‌కుమార్, కలెక్టర్ ప్రతీక్‌జైన్ సందర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభు త్వం తరఫున రూ.7 లక్షలు, స్పీకర్ తన వంతుగా లక్ష రూపాయలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బస్సు ప్రమాదం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, డీసీసీబీ డైరక్టర్ కిషన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
19 మందిలో.. 13 మంది మహిళలే
బషీరాబాద్: మీర్జాగూడ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందడం రాష్ట్రంలో సంచలనం కలిగించింది. అయితే ఈ ఘటనలో ఆసక్తికర విషయం తెరమీదకు వచ్చింది. సోమవారం తాండూరు నుంచి బయలు దేరిన బస్సులో 70 శాతం ప్రయాణికులు మహిళలే ఉన్నట్లు తెలిసింది. వారికి బస్సులో కుడివైపు సీట్లు రిజర్వు ఉండడంతో డ్రైవర్ వెనుకాల వరుసలో ఎక్కువ మంది మహిళలు కూర్చున్నారు. టిప్పర్ కుడివైపున ఢీకొట్టడంతో డ్రైవర్ వెనుక వరుసలో కూ ర్చున్న 13 మంది దుర్మరణం చెందారు. చాలా మంది మహిళలు గాయాలపాలయ్యా రు. మృతుల్లో కల్పన(42), గున్నమ్మ (60), తారీబాయి(44), గుర్రాల అఖిల (23), నాగమణి(54), తబస్సుమ్‌జాన్(38), నందిని (22), సాయిప్రియ(18), తనూష (20), వెంకటమ్మ(21), లక్ష్మి(40), సెలా (20), ముస్క న్ బేగం (21) ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లతో కలిపి పురుషులు ఆరుగురు ఉన్నారు.
● మీర్జాగూడ ప్రమాదం ఘటనలో పలువురు మహిళలకు గాయాలు
● కుడిపక్కన కూర్చోవడంతో అధిక ప్రాణనష్టం


