భూసార పరీక్షలు తప్పనిసరి చేయించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

భూసార పరీక్షలు తప్పనిసరి చేయించుకోవాలి

Nov 5 2025 8:42 AM | Updated on Nov 5 2025 8:42 AM

భూసార

భూసార పరీక్షలు తప్పనిసరి చేయించుకోవాలి

భూసార పరీక్షలు తప్పనిసరి చేయించుకోవాలి

జిల్లా వ్యవసాయాధికారి ఉష

నందిగామ: రైతులు తమ భూములకు సంబంధించి భూసార పరీక్షలను తప్పనిసరి చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉష అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం రైతులకు భూసార పరీక్షలకు సంబంధించి సాయిల్‌ హెల్త్‌కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు తమ భూములు ఏ పంటలకు అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవడానికి భూసార పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. దీంతో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. రైతులకు ఏమైనా సమస్యలుంటే సంబంధిత వ్యవసాయాధికారులను సంప్రదించాలని చెప్పారు. రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులను వాడాలని సూచించారు. కార్యక్రమంలో షాద్‌నగర్‌ ఏడీఏ రమాదేవి, టెక్నికల్‌ ఏఓలు శిల్ప, శోభారాణి, మండల వ్యవసాయాధికారి రామశివరావు, ఏఈఓలు శిరీష, రవి కుమార్‌, ఏఎంసీ డైరెక్టర్‌ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.

మెడికో రూమ్‌లో డ్రగ్స్‌

టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి

పీజీ వైద్యుడు జాన్‌పాల్‌ అరెస్టు

ముషీరాబాద్‌: డ్రగ్స్‌ తీసుకోవడమే కాకుండా గుట్టుచప్పుడు కాకుండా ఇతరులకు విక్రయిస్తున్న ఓ పీజీ డాక్టర్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... తెనాలికి చెందిన జోసెఫ్‌ జాన్‌పాల్‌ ఎంబీబీఎస్‌ పూర్తి చేసి గాంధీ మెడికల్‌ కళాశాలలో ఫోరెన్సిక్‌ సబ్జెక్ట్‌పై పోస్ట్‌ గ్రాడ్యూయేషన్‌ (పీజీ) చేస్తున్నాడు. ఇతడు గాంధీ మెడికల్‌ కళాశాల సమీపంలోని బాకారం సాగర్‌ లాల్‌ ఆసుపత్రి వీధిలో ఓ రూమ్‌ను అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. ఇతడికి ప్రమోద్‌, సందీప్‌, శరత్‌లు అనే స్నేహితులు ఉన్నారు. ఇందులో ఒకరు డాక్టర్‌, ఇద్దరు సాప్ట్‌వేర్‌ ఇంజనీర్లు. ఈ ముగ్గురి ద్వారా జాన్‌పాల్‌కు డ్రగ్స్‌ అలవాటైంది. ఈ క్రమంలో డ్రగ్స్‌ కొనేందుకు డబ్బులు సరిపోకపోవడంతో వీరు విక్రేతలుగా మారారు. ఢిల్లీ, బెంగళూర్‌ నుంచి తీసుకువచ్చిన డ్రగ్స్‌ను జాన్‌పాల్‌ రూమ్‌లో దాచి అవసరమైన వారికి విక్రయిస్తున్నారు. దీనిపై అందిన సమాచారం మేరకు తెలంగాణ ఎకై ్సజ్‌ టాస్క్‌ఫోర్స్‌ బీ టీమ్‌ లీడర్‌ ప్రదీప్‌రావు, ఎస్సై బాలరాజు, సిబ్బంది మంగళవారం ఉదయం రూమ్‌పై దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఓజీ, ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ, కొకై న్‌, హాష్‌ ఆయిల్‌, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు 26 గ్రాములు దోరికాయి. వీటి విలువ దాదాపు మూడు లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు. విచారణ నిమిత్తం జాన్‌పాల్‌ను అరెస్టు చేసి ముషీరాబాద్‌ ఎకై ్సజ్‌ పోలీసులకు అప్పగించగా సీఐ రామకృష్ణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. జాన్‌పాల్‌ను రిమాండ్‌కు తరలించి పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

భూసార పరీక్షలు తప్పనిసరి చేయించుకోవాలి  1
1/1

భూసార పరీక్షలు తప్పనిసరి చేయించుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement