
భూ బాధితులకు ఇంటి జాగలు
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: ఎల్మినేడు భూ బాధితులకు ఇచ్చిన మాట ప్రకారం ఇంటి జాగలు ఇచ్చి ఆదుకుంటానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం భూ బాధితులు ఎమ్మెల్యే నివాసంలో మల్‌రెడ్డి రంగారెడ్డిని కలిసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఒప్పించి కలెక్టర్‌కు ఆదేశాలు ఇప్పించామని చెప్పారు. త్వరలోనే అధికారులు ఎల్మినేడుకు మళ్లీ వస్తారన్నారు. మొదట ఎంజాయ్‌మెంట్ సర్వే చేపట్టి రికార్డు ప్రకారం అసలైన రైతులకే ప్లాట్లు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. అక్రమాలు, అవినీతి జరిగితే లీగల్‌టీం క్షుణ్ణంగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటుందని వివరించారు. అధికారులు పారదర్శకంగా సర్వే చేసి అందరికి న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పట్నం శివశంకర్, శేఖర్‌రెడ్డి, యాదగిరి, శ్రీశైలం, నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నంలో ఘన స్వాగతం
ఇబ్రహీంపట్నం: ముగ్గురు మండల వాసులకు డాక్టరేట్ వరించింది. ఢిల్లీకి చెందిన మ్యాజిక్ అండ్ ఆర్ట్స్ యూనివర్సిటీ సోషల్ వర్క్, సేవా కార్యక్రమాలను గుర్తించి ఓ మీడియా సంస్థ ప్రతినిధిగా పనిచేస్తున్న సురమోని సత్యనారాయణ, మత్స్యకార సంఘం నేత, టీడీపీ నాయకుడు జలమోని రవీందర్ ముదిరాజ్, మాజీ ఉపసర్పంచ్, బీఆర్‌ఎస్ ఆదిబట్ల నాయకుడు పల్లె గోపాల్‌గౌడ్‌కు డాక్టరేట్ ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆదివారం వారికి ఇబ్నహీంపట్నంలో ఘన స్వాగతం పలికారు.
రజకాభివృద్ధి సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్
కందుకూరు: సమస్యల పరిష్కారానికి రజకులంతా ఏకతాటిపైకి రావాలని రజకాభివృద్ధి సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమరాజు వెంకటేశ్ అన్నారు. ఆదివారం మండలకేంద్రం సమీపంలోని పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి సంఘటితంగా పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు అక్కేనపల్లి శ్రీనివాస్, నాయకులు మల్లేశ్, రాజు, కృష్ణ, సురేందర్ రాజు, వెంకటేశ్, గణేష్, శంకరయ్య, శ్రీనివాస్, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు గుణపాఠం కావాలి
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
శ్రీనగర్‌కాలనీ: జూబ్లీహిల్స్‌లో జరగనున్న ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు గుణపాఠం కావాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. షేక్‌పేటకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు చెర్క మహేష్ ఆదివారం నగరంలోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌లో చేరా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ప్రజలకు కారు కావాలో, బుల్డోజర్ కావాలో నిర్ణయించుకోవాలన్నారు. అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్‌లో ఖర్చు చేయనున్నారని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్టేనన్నా రు. హైదరాబాద్ గాడిన పడాలంటే కేసీఆర్ రావాలని, అది జూబ్లీహిల్స్ నుంచి ప్రారంభం కావాలన్నారు. అన్నీ తెలిసీ బీసీ రిజర్వేషన్ల అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. పార్లమెంట్‌లో చేయాల్సి న చట్టం అసెంబ్లీలో చేస్తే చెల్లదని తెలిసి బీసీ రిజర్వేషన్ల పేరుతో మోసం చేశారన్నారు.

భూ బాధితులకు ఇంటి జాగలు

భూ బాధితులకు ఇంటి జాగలు