
అట్టహాసంగా ‘గ్లోబల్ గ్రేస్ కేన్సర్ రన్’
గచ్చిబౌలి: నగరంలో ఆదివారం జరిగిన గ్లోబల్ గ్రేస్ కేన్సర్ రన్‌కు అనూహ్య స్పందన లభించింది. గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి పర్యవేక్షణలో రన్‌ను గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వద్ద రాష్ట్ర మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, పీఏసీ చైర్మన్ ఆరెకపూడిగాంధీ, స్పోర్ట్స్ అఽథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్ సీపీలు సజ్జనర్, అవినాష్ మహంతి జెండా ఊపి ప్రారంభించారు. రన్‌లో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, ఔత్సాహిక రన్నర్లు పాల్గొన్నారు. సుమారు 30 వేల మంది ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనగా.. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల నుంచి 1.5 లక్షల మంది వర్చువల్‌గా పాల్గొన్నట్లు గ్రేస్ కేన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి వివరించారు. ఈ సందర్భంగా కేన్సర్‌ను జయించిన నీలిమ, ప్రకాశ్, సంగీత, గీత రన్‌లో పాల్గొనడం విశేషం. మహిళల విభాగంలో రాజేశ్వరి సునీత, ఉమా, పురుషుల విభాగంలో ఈశ్వర్, అనూజ్ యాదవ్, మనోజ్ విజేతలుగా నిలిచారు.

అట్టహాసంగా ‘గ్లోబల్ గ్రేస్ కేన్సర్ రన్’