
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు
దుద్యాల్: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్‌ఐ యాదగిరి హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందునా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా రాజకీయ పార్టీలపై, కులమతాల పేరిట దుష్ప్రచారం చేసినా, అవమానకరమైన వ్యాఖ్యలు, రెచ్చగొట్టె ప్రసంగాలు చేయొద్దని సూచించారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు కథనాలు, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయా వ్యక్తులను టార్గెట్ చేసి మాట్లాడినా, ప్రసారాలు చేసినా అన్నీ ఎన్నికల నేరం కింద పరిగనింపబడుతాయని ఎస్‌ఐ వివరించారు.
ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా ప్రజలకు ఇచ్చే సూచనలు ..
● ఇతర ప్రాంతాలకు ప్రయాణించే సమయంలో తమ వెంట రూ. 50,000లకు మించి నగదు ఉండొద్దు.
● ఎన్నికల సమయంలో అక్రమంగా మద్యం పంపిణీ చేసినా, తమ దగ్గర ఉన్నా నేరమే.
● ఓటు కోసం రాజకీయ పార్టీల నుంచి, పోటీ దారుల నుంచి ఎటువంటి బహుమతులు, నగదు, వస్తువు రూపేణ తీసుకోవడం నిషేధమే.
● ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా అందరు ప్రభుత్వానికి సహకరించాలి.
● లంచం, బెదిరింపులు, డబ్బు లేదా మద్యం పంపిణీ, కులమత భేదాల ఆధారంగా ప్రచారంచేయడం వంటివి చేయొద్దు.
పై విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినా పలు రకాల సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఐ యాదగిరి హెచ్చరించారు.
ఎస్‌ఐ యాదగిరి