
జంట జలాశయాలకు వరద
వాతావరణం శాఖఆరెంజ్ అలెర్ట్ జారీ
● అప్రమత్తమైన జలమండలి
సాక్షి, సిటీబ్యూరో: జంట జలాశయాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తు న్న భారీ వర్షాలు, నాగార్జున సాగర్ గేట్ల ఎత్తివేతతో వరద ప్రవాహం పెరిగింది. మరో వైపు వాతావరణం శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ముందస్తు జాగ్రత్తగా జలమండలి అప్రమత్తమైంది. జంట జలాశయాలకు చేరుతున్న నీటిని వచ్చినట్టే దిగువన మూసీలోకి వదులుతున్నారు. శనివారం జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జంట జలాశయాలను అధికారులతో కలిసి సందర్శించారు. వాతావరణం శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయడంతో రెవెన్యూ, సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు
జంట జలాశయాలు ఇలా..
ఉస్మాన్ సాగర్ పూర్తి నీటి మట్టం: 1790.00 అడుగులు (3.900 టీఎంసీలు)
ప్రస్తుత మట్టం: 1789.35 అడుగులు (3.751టీఎంసీలు)
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద : 600 క్యూసెక్కులు
దిగువకు వదులుతున్న వరద: 2652 క్యూసెక్కులు
గేట్లు ఎత్తివేత: 4 అడుగుల ఎత్తుకు 6 గేట్లు
హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం: 1763.50 అడుగులు (2.970 టీఎంసీలు)
ప్రస్తుత మట్టం: 1762.95 (2.780 టీఎంసీలు)
ఎగువ ప్రాంతాలనుంచి వస్తున్న వరద: 400 క్యూసెక్కులు
దిగువకు వదులుతున్న వరద : 1981 క్యూసెక్స్
గేట్లు ఎత్తివేత: 3 అడుగుల ఎత్తుకు 2 గేట్లు

జంట జలాశయాలకు వరద