
మరపురాని నేత ఇంద్రారెడ్డి
చేవెళ్ల: మరపురాని మహానేత, ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడు ఇంద్రారెడ్డి అని ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. హోశాఖ మాజీ మంత్రి ఇంద్రారెడ్డి జయంతిని పురస్కరించుకొని శనివారం మండల పరిధి కౌకుంట్లలో ఆయన సమాధి వద్ద కుమారులు కార్తీక్‌రెడ్డి, కౌసిక్‌రెడ్డి, కల్యాణ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఇంద్రారెడ్డి జ్ఞాపకాలు, ఆశయాలు మరపురానివని పేర్కొన్నారు. నిరంతరం ఆయన ప్రజలకోసం తపించారని, వారి ఆశయాలకు అనుగుణంగా తమ కుటుంబం పనిచేస్తుందని తెలిపారు. డీసీఎంఎస్ మాజీ చైర్మన్ పి.కృష్ణారెడ్డి, మమేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ ఎం.బాలరాజ్, పార్టీ మండల అధ్యక్షుడు పి.ప్రభాకర్, కరుణాకర్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, దర్శన్, రాజు, మానిక్యరెడ్డి, మాదవ్‌గౌడ్, కరుణాకర్‌రెడ్డి, నర్సింహులు, కృష్ణ, మల్లారెడ్డి, గోపాలకృష్ణ, అంజయ్య, శేఖర్, ప్రసాద్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సబితారెడ్డి