
కూరగాయలు కొనేందుకు వెళ్తూ..
చేవెళ్ల: కూరగాయలు కొనేందుకని బైక్‌పై వెళ్లిన ఓ వ్యక్తిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి గ్రామానికి చెందిన వడ్డె మల్లేశ్(32) డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన ఇంటి నుంచి కూరగాయలు కొనేందుకు తన బైక్‌పై చేవెళ్లకు వస్తున్నారు. మార్గమధ్యలో కందవాడ లింక్ రోడ్డు సమీపంలో లారీ ఢీకొట్టింది. దీంతో మల్లేశ్ లారీ చక్రాల కింది పడి అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య సరిత, ముగ్గురు పిల్లలున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
లారీ ఢీకొట్టడంతో ఒకరి దుర్మరణం