
నేరాల నియంత్రణలో ‘సీసీ’లు కీలకం
మీర్‌పేట: ప్రతిఒక్కరూ తమ వీధిలో, ఇంటి ఎదుట సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ శంకర్‌నాయక్ సూచించారు. మీర్‌పేట డీఎల్‌ఆర్‌ఎల్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం సీఐ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరస్తులను పట్టించడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కీసర హరినాథ్‌రెడ్డి, కాలనీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, సభ్యులు లక్ష్మణాచారి, నరసింహులు, భిక్షపతిరెడ్డి, అంజయ్య, మాణిక్ ప్రభు, శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.