
శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలి
పహాడీషరీఫ్: మిలాద్–ఉన్–నబీ ర్యాలీని శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ రెడ్డి సూచించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో శనివారం రాత్రి పీస్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్‌పల్లి, వాదే ముస్తాఫా, పహాడీషరీఫ్ ప్రాంతాలలో శాంతియుతంగా ర్యాలీలు తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలతో పాటు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు.