
వేతనాల అవకతవకలపై నివేదిక ఇవ్వండి
మహేశ్వరం: మహేశ్వరం మోడల్ స్కూల్‌లో స్కావెంజ ర్ల వేతనాల్లో ప్రిన్సిపాల్ గోపి అవకతవకలకు పాల్పడినట్లు బుధవారం ‘సాక్షి’దినపత్రిక లో ‘ఇదేమి ఆదర్శం!’శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఇందుకు స్పందించిన కలెక్టర్ నారాయణరెడ్డి మహేశ్వరం మోడల్ స్కూల్‌లో పని చేసే స్కావెంజర్లకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పథకానికి ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు మంజూరయ్యాయి? ఎంత మందిని నియమించి ఎంత జీతాలు ఇచ్చారు అనే విషయాలపై పూర్తి నివేదిక అందజేయలని డీఈఓ సుశీందర్‌రావును ఆదేశించారు. జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు ఎంఈఓ కస్నానా యక్ ప్రిన్సిపాల్ గోపి నుంచి వివరాలు సేకరించారు. పూర్తి నివేదికను డీఈఓకు అందజేశారు.
స్కూటీ డిక్కీలోంచి రూ.2.97 లక్షలు చోరీ
శంకర్‌పల్లి: బ్యాంకులో నగదు డిపాజిట్ చే సేందుకు వెళ్లిన ఓ వ్యక్తిని.. క్యూలైన్ కొంపముంచింది. ఈ ఘటన శుక్రవారం శంకర్‌పల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మున్సిపల్ పరిధిలోని హనుమాన్ నగర్‌కి చెందిన ప్రమోద్ గౌడ్(25) పట్టణంలో ఓ ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఉదయం ఆయన తల్లి డ్వాక్రా సంఘానికి సంబంధించిన రూ. 2.97లక్షల డబ్బులను యూనియన్ బ్యాంకులో డిపాజిట్ చేయమని చెప్పింది. మధ్యాహ్నం బ్యాంక్‌కు వెళ్లగా క్యూలైన్ ఎక్కువ ఉంది. దీంతో ల్యాబ్‌లో పనిచేసుకుని వద్దామని నగదును స్కూటీలో పెట్టుకుని వెళ్లాడు. 15నిమిషాల తర్వాత బయటకి వచ్చి చూడగా నగదు మాయమైంది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.
ఆర్టీఏ ఆల్‌నైన్స్‌కు రూ.25.50 లక్షలు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏ ప్రత్యేక నంబర్‌లకు నిర్వహించిన బిడ్డింగ్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. శుక్రవారం ఖైరతాబాద్‌లో నిర్వహించిన బిడ్డింగ్‌లో రవాణాశాఖకు రూ.63,77,361 ఆదాయం లభించినట్లు హైదరాబాద్ జేటీసీ రమే ష్ తెలిపారు. ‘టీజీ 09జీ 9999’ నెంబర్‌కు హెటి రో డ్రగ్స్ సంస్థ రూ.25,50,200 చెల్లించి నెంబర్ దక్కించుకుంది.‘టీజీ 09హెచ్0009’ నెంబర్ ను ఏఆర్‌ఎల్ టైర్స్ లిమిటెడ్ సంస్థ రూ.6,50,009 చెల్లించింది.‘టీజీ 09హెచ్001’ నెంబర్‌కు డాక్టర్ రాజేశ్వరి స్కిన్‌అండ్ హెయిర్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.6,25,999 చెల్లించి ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో నెంబర్ దక్కించుకుంది. ‘టీజీ 09హెచ్0006’ నెంబర్‌కు రూ.5,11,666 లభించింది. ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ ఈ నెంబర్‌ను సొంతం చేసుకుంది.