
ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోండి
ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్
మహేశ్వరం: మహేశ్వరం మోడల్ స్కూల్‌లో స్కావెంజర్ల జీతాల్లో అవినీతికి పాల్పడిన ప్రిన్సిపాల్ గోపిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌ను ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమ్మ ఆదర్శ పాఠశాల పథకం కింద గతేడాది ఆగస్టు నుంచి నెలకు రూ.10 వేల చొప్పున మరుగుదొడ్లు శుభ్రం చేసేవారు(స్కావెంజర్ల) జీతాల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. ప్రిన్సిపాల్ ఇద్దరి స్కావెంజర్లను నియమించి వారికి నెలకు రూ.10 వేల చొప్పున జీతం ఇవ్వకుండా, కేవలం రూ.7వేల ఇచ్చారని ఆరోపించారు. స్కావెంజర్ల జీతాలలో ప్రిన్సిపాల్ చేతివాతం ప్రదర్శించి అవినీతి చేయడం సరికాదన్నారు. వెంటనే ప్రిన్సిపాల్ గోపిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సిద్ధు, తరుణ్, రాహుల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.