
తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని ఐలమ్మ
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తి వీర వనిత చాకలి ఐలమ్మ త్యాగమేనని జిల్లా రెవెన్యూ అధికారి సంగీత అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. కలెక్టరేట్‌లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ సంగీత మాట్లాడుతూ.. ఐలమ్మ జీవితం అందరికీ ఆదర్శమన్నారు. భూమి నాది, పండించిన పంట నాది తీసుకెళ్లడానికి దొర ఎవ్వడు, ప్రాణం పోయినా పంట పోనియ్య అని ఎదురుతిరిగిన ధీశాలి అని కొనియాడారు. భూ స్వాముల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి కేషురామ్, వివిధ సంఘాల ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .
జిల్లా రెవెన్యూ అధికారి సంగీత