
ఓ వైపు భగభగ.. మరో వైపు జలకళ
● దిగువన ఈసీ పరుగులు
● నీటిపాలైన పంటపొలాలు
మొయినాబాద్‌రూరల్: ఓ వైపు సూర్యుడి భగభగలు. మరోవైపు చినుకు వర్షం పడకపోయినా ఈసీకి ఉన్నట్టుండి వరద ప్రవాహం పోటెత్తింది. పంటపొలాలను ముంచెత్తింది. రైతులను నట్టేట ముంచింది. ఎగువ ప్రాంతమైన వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల నుంచి మొదలైన ఈసీ.. అక్కడ మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు మన్నెగూడ, చేవెళ్లతో పాటు మొయినాబాద్ మండలాన్ని తాకుతూ.. హిమాయత్‌సాగర్‌కు నీరు చేర్చే ఈసీ బుధవారం ఉదయం 9 గంటలకు ఉరకలు పెట్టింది. చుట్టూ ఉన్న పూలతోటలు, వరి చేలను నామరూపాల్లేకుండా చేసింది. స్థానికంగా వరుణుడు కరుణించకపోయినా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాగు ప్రవహిస్తుండడంతో పరిసర ప్రాంతాల ప్రజలు, వాహనాదారులు ఆసక్తిగా తిలకించారు. ఆశ్ఛర్యానికి లోనయ్యారు.

ఓ వైపు భగభగ.. మరో వైపు జలకళ

ఓ వైపు భగభగ.. మరో వైపు జలకళ