
పథకం బెడిసికొట్టింది..
బంజారాహిల్స్: ఓ సినీ యువ హీరోను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ఓ ఎకై ్సజ్ కానిస్టేబుల్ పథకం వేశాడు. ఇందుకోసం సదరు హీరో స్నేహితురాలైన యువ నటిని ఎరగా వేద్దామనుకున్నాడు. ఈ విషయం పసిగట్టిన సదరు హీరో సినీ ఫక్కీలో పథకం వేసి అదే స్నేహితురాలితో ఎకై ్సజ్ కానిస్టేబుల్‌ను అడ్డంగా ఇరికించాడు. సినిమాను తలపించిన ఈ ఘటన ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎకై ్సజ్ స్టేట్ టాస్క్‌ఫోర్స్ (ఎస్‌టీఎఫ్)లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఎస్‌ఎన్‌ఎల్ మహేశ్వర్‌రావు అలియాస్ ఎస్.మహేష్ గత కొంతకాలంగా జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లోని పబ్‌లలో పర్యటిస్తూ తాను ఎస్‌ఐనని, ఇన్‌స్పెక్టర్‌నని పరిచయం చేసుకుంటూ అక్కడికి వచ్చే సినీ నటుల కదలికలను గమనిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ యువ హీరో పలుమార్లు తన భార్య, స్నేహితురాలైన నటితో కలిసి పబ్‌లకు వస్తుండడాన్ని అతను గుర్తించాడు. సదరు నటి కదలికలపై నిఘా పెట్టిన అతను ఆమెకు ఫోన్ చేసి తాను ఎకై ్సజ్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్‌నని, మీరు డ్రగ్స్ తీసుకుంటున్నారు.. నా వద్ద ఆధారాలు ఉన్నాయి.. వీడియోలు ఉన్నాయంటూ ఆమె వెళ్లిన ప్రాంతాల్లో తీసిన ఫోటోలను వాట్సప్ ద్వారా పంపించాడు. ఇటీవల ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించడమేగాక తన కోరిక తీర్చకపోతే డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. ఓ యువ హీరో పేరు చెప్పి అతను కూడా డ్రగ్స్ తీసుకుంటున్నాడని చెప్పాలని ఆమైపె ఒత్తిడి చేశాడు. మహేశ్ వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు ఈ విషయాన్ని సదరు యువ హీరో భార్యకు చెప్పింది. అతను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఫిలింనగర్ పోలీసులు మంగళవారం సదరు నటిని విచారించడంతో ఆమె తనకు జరుగుతున్న వేధింపులను పోలీసుల దృష్టికి తీసుకువచ్చింది. పోలీసులు ఎకై ్సజ్ కానిస్టేబుల్ మహేశ్వర్‌రావును అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే తాను కొందరు సినీనటులను డ్రగ్స్ కేసులో అరెస్టు చేసేందుకు ఈ పథకం వేశానని మహేశ్వర్‌రావు పోలీసులకు చెప్పాడు. అయితే అతను సీఐనని ఎందుకు చెప్పుకుంటున్నాడు.. ఆ నటిని ఎందుకు ఫాలో అయ్యాడు.. ఆ హీరోను ఎందుకు బుక్ చేద్దామనుకున్నాడు.. తదితర విషయాలపై ఆరా తీయగా అతను గత కొంతకాలంగా టాలీవుడ్ ప్రముఖులను బెదిరిస్తున్నట్లుగా నిర్థారణ అయ్యింది. పలువురు సినీ ప్రముఖుల ఇంటికి వెళ్లి డబ్బులు కూడా దండుకున్నట్లు తేలింది. డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో డ్రగ్స్ దొరికాయని కేసు పెడతానని బ్లాక్‌మెయిల్ చేసినట్లు నిర్థారించారు. అంతేకాకుండా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లో పలువురు పబ్ యజమానుల నుంచి రూ. లక్షలు వసూలు చేసినట్లు తేలింది. కొందరు మహిళలను బెదిరించి వారి నుంచి డబ్బులు వసూలు చేయడమే కాకుండా, వారితో అసభ్యంగా ప్రవర్తించినట్లు వెలుగులోకి వచ్చింది. ఆయన కాల్ డేటా, నగదు లావాదేవీలు, వాట్సప్, సోషల్ మీడియా మెసేజ్‌లను పరిశీలించిన పోలీసులు ఇప్పటివరకు 25 మంది సినీ ప్రముఖులు, వ్యాపార, పారిశ్రామికవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. సదరు కానిస్టేబుల్ ట్రూ కాలర్‌లో తాను సీఐనంటూ, డ్రగ్స్ పట్టుకోవడంలో దేశముదురునంటూ మోసాలకు పాల్పడుతున్నాడని ఇటీవల కొందరు సినీ ప్రముఖులు కూడా టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తేలింది. నిందితుడిని విచారించిన ఫిలింనగర్ పోలీసులు విచారణ నివేదికతో పాటు ఎకై ్సజ్ అధికారులకు అప్పగించారు.
డ్రగ్స్ కేసులో యువ హీరోను
ఇరికించేందుకు యత్నం
సినీ నటిని బ్లాక్‌మెయిల్ చేసిన
ఎకై ్సజ్ కానిస్టేబుల్..
విచారణ చేపట్టిన ఫిలింనగర్ పోలీసులు..
ఉన్నతాధికారులకు అప్పగింత.
డ్రగ్స్ పేరుతో ప్రముఖులకు బెదిరింపులు