
‘కేసీఆర్ గతే రేవంత్‌రెడ్డికి పడుతుంది’
● ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను
వెంటనే చెల్లించాలి
● ఏబీవీపీ శంషాబాద్ విభాగ్
కన్వీనర్ సూర్యప్రకాశ్
షాద్‌నగర్‌రూరల్: విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుంటే గత ఎన్నికల్లో కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌రెడ్డికి పడుతుందని ఏబీవీపీ శంషాబాద్ విభాగ్ కన్వీనర్ సూర్యప్రకాశ్ అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ బుధవారం ఏబీవీపీ నగర కార్యదర్శి నవీన్‌నాయక్ ఆధ్వర్యంలో పట్టణ ముఖ్యకూడలిలో విద్యార్థులతో పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల బలిదానాలపై నిర్మించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. స్కాలర్‌షిప్ భిక్ష కాదు, విద్యార్థుల హక్కు అనే నినాదంతో విద్యార్థులు పోరాటాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 21 నెలలు గడుస్తున్నా నేటి వరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం శోఛనీయమన్నారు. ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను సకాలంలో చెల్లించకపోవడంతో విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించలేక, ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, లేని యెడలా ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఏబీవీపీ నాయకులు చందు, పవన్‌కళ్యాణ్, నవీన్, కోమల్, వినయ్, సాయి, జశ్వంత్, రాంచరణ్, రమేశ్, పాండు, భరత్ ఉన్నారు.