
చదువుతో పాటు.. ఆటలు ముఖ్యం
ఎన్‌ఐఎన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శిరీష
కడ్తాల్: విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు ముఖ్యమేనని, శారీరక శ్రమ తప్పనిసరిగా ఉండాలని జాతీయ పౌష్టికాహార పరిశోధన సంస్థ (ఎన్‌ఐఎన్) అసిస్టెంట్ ప్రొఫెసర్ శిరీష అన్నారు. రోజు వారి ఆహారంలో పోషక ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో.. కౌన్సిల్‌ఫర్ గ్రీన్ రెవల్యూషన్, తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో యంగ్ ఎర్త్ లీడర్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పౌష్టికాహార పరిశోధన సంస్థ నిపుణులు విద్యార్థులకు పౌష్టికాహారంపై అవగాహన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం అరుణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ప్రొఫెసర్ మాట్లాడారు. జంక్ ఫుడ్ తీసుకోవద్దని చెప్పారు. అనంతరం నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పరిశోధన బృందం వంశీకృష్ణ, సప్తదీపఘోష్, జాన్వీ, కుజిత, యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాం జిల్లా కోఆర్డినేటర్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.