
ప్రయాణికుల ముసుగులో గంజాయి రవాణా
● ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
● 21.33 కిలోల గంజాయి స్వాధీనం
అబ్దుల్లాపూర్‌మెట్: ప్రయాణికుల ముసుగులో గుట్టుగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎకై ్సజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 21.33 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ అధికారులు తెలిపిన ప్రకారం.. మంగళవారం జిల్లా ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఆధ్వర్యంలో విజయవాడ జాతీయ రహదారి అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ బస్సులో తనిఖీ చేయగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి బ్యాగులు, సూట్ కేసులు తనిఖీ చేయడంతో ప్యాకింగ్ చేసిన ఉన్న గంజాయి కవర్లు కనిపించాయి. దీంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా ఒడిశా రాష్ట్రం జైపూర్‌కు చెందిన కుష్భూనాయక్ ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి డెలివరీకి అదే రాష్ట్రానికి చెందిన బీరెన్‌నాయక్, రాజేంద్రశెట్టిని కొరియర్‌లుగా నియమించుకున్నాడు. ఈ క్రమంలో కుష్భూనాయక్ సూచన మేరకు సోమవారం రాత్రి బీరెన్‌నాయక్, రాజేంద్రశెట్టి గంజాయితో హైదరాబాద్‌కు బయలుదేరారు. మంగళవారం ఉదయం మార్గమధ్యలో అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద వాహనాలను తనిఖీచేస్తున్న జిల్లా ఎకై ్సజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం వీరిని గుర్తించి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణకు హయత్‌నగర్ ఎకై ్సజ్ పోలీసులకు అప్పగించారు. కాగా అసలు సూత్రధారి కుష్భూనాయక్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.