
ఆస్పత్రులపై నిఘా ఉంచాలి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: అనుమతుల్లేని ఆస్పత్రులపై మరింత కఠినంగా వ్యవహరించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్‌రావు సంబంధిత వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. అడ్డగోలు చికిత్సలు చేస్తున్న ఆస్పత్రులు, వైద్యులపై గట్టి నిఘా ఉంచాల్సిందిగా సూచించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కార్యాలయంలో ఆయన సంబంధిత మెడికల్ ఆఫీసర్లతో సమావేశం అయ్యారు. తనిఖీల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వైద్యులు, ఇతర సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విఽధి నిర్వహణలో మరింత కఠినంగా వ్యవహరించాల్సిందిగా కోరారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వస్తునారీ స్వశక్తి పరివార్ అభియాన్ (అతివ ఆరోగ్యమస్తు) పేరుతో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో డాక్టర్ విజయ పూర్ణిమ, డాక్టర్ గీత, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ నాగేంద్రబాబు, డాక్టర్ రాధిక, డాక్టర్ పూనం, డాక్టర్ రాకేష్, డెమో శ్రీనివాసులు పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్‌రావు