
గ్రేటర్ కేడర్‌కు పెద్దపీట
సాక్షి, రంగారెడ్డిజిల్లా: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో గ్రేటర్ కేడర్‌కు పెద్దపీట వేసింది. మొత్తం 22 మందిని ఎంపిక చేయగా వీరిలో సగానికిపైగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా నేతలే ఉండడం గమనార్హం. ఉపాధ్యక్షులుగా మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన మహిళా మోర్చ నాయకురాలు కొల్లి మాధవి, మాజీ మేయర్ బండారు కార్తీకారెడ్డి నియమితులయ్యారు. ప్రధాన కార్యదర్శులుగా పార్టీ హైదరాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు ఎన్.గౌతంరావు, రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకుడు టి.వీరేందర్‌గౌడ్, కార్యదర్శిగా ఎస్సీ మోర్చ మాజీ అధ్యక్షుడు కొప్పు బాష, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి, సీనియర్ నేత బద్ధం మహిపాల్‌రెడ్డి నియమితులయ్యారు. సంయుక్త కోశాధికారిగా సువర్ణజైన్, చీఫ్ స్పోక్‌పర్సన్‌గా ఎన్‌వీ సుభాష్ నియమితులయ్యారు. పార్టీ అనుబంధ సంఘాలకు సైతం బాధ్యులను ఎంపిక చేశారు. యువ మోర్చ అధ్యక్షుడిగా మొయినాబాద్‌కు చెందిన గణేశ్‌కుండే, మహిళా మోర్చ అధ్యక్షురాలిగా మేకల శిల్పారెడ్డి, ఓబీసీ మోర్చ అధ్యక్షుడిగా గందమల్ల ఆనంద్‌గౌడ్‌ను నియమించారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో సముచిత స్థానం