
డయాలసిస్ కేంద్రం.. కిడ్నీ రోగులకు వరం
రోజు మూడు షిప్టుల్లోమెరుగైన సేవలు
మహేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రిలోనిడయాలసిస్ కేంద్రం కిడ్నీ రోగులకు వరంగా మారింది. ఉచితంగా మెరుగైన సేవలుఅందిస్తూ భారీ ఊరట కలిగిస్తోంది. నిత్యం 15 మంది మెరుగైన వైద్య చికిత్సపొందుతూ ఉపశమనం పొందుతున్నారు.
మహేశ్వరం: మహేశ్వరంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రం రోగులకు వరంలా మారింది. గతంలో ఇక్కడ సెంటర్ లేకపోవడంతో బాధితులు నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు పురుగులు తీసేవా రు. రూ.3 వేల నుంచి ఐదు వేలు వెచ్చించి చికిత్స చేయించుకునే వారు. ఈ నేపథ్యంలో ఇక్కడి రోగు ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం.. మండల కేంద్రంలోని ధర్మాసుపత్రిలో 2018లో ఐ దు పడకల డయాలసిస్ సెంటర్‌ను నెలకొల్పింది.
ఉచిత ప్రయాణం..
రోగులు ఉన్న ప్రాంతం నుంచి రక్తశుద్ధి కేంద్రానికి వచ్చేందుకు వీలుగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతిని కల్పించింది. ప్రభుత్వఒప్పందంతో అఫెక్స్ కిడ్నీకేర్ ప్రైవేట్ కంపెనీ.. ఆదీనంలోని డయాలసిస్ కేంద్రాల్లో రక్తశుద్ధి ప్రక్రియను ఉచితంగా చేయిస్తూ బాధితుల్లో మనోధైర్యాన్ని నింపుతోంది. చికిత్సతో పాటు ఉచితంగా సూది మందు ఇస్తోంది.
మూడు విడతలుగా..
మండల కేంద్రంలోని డయాలసిస్ కేంద్రానికి మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్, ఆమనగల్లు తదితర మండలాల నుంచి సుమారు 30 మంది రోగులు వస్తుంటారు. ప్రతి రోజు మూడు షిప్టుల్లో సేవలందిస్తున్నారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, 3.30 నుంచి రాత్రి 7.30 చికిత్స అందిస్తున్నారు.
మరో కేంద్రం ఏర్పాటు
ప్రతి బాధితుడికి వారంలో మూడు రోజుల పాటు ముందస్తుగా కేటాయించిన సమయం ప్రకారం సేవలు అందుతాయి. ఒక్కో వ్యక్తికి నాలుగు గంట ల పాటు రక్తశుద్ధి ప్రక్రియ కొనసాగుతోంది. గతంలో డయాలసిస్ కోసం రోగులు నగరంలోని గాంధీ, ఉస్మానియా, ప్రైౖవేట్ ఆస్పత్రులకు వెళ్లేవారు. అక్కడ పేర్లు నమోదు చేసుకొని గంటల తరబడి నిరీక్షించేవారు. ప్రస్తుతం ఆ బాధలేదని బాధితులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతకేంద్రానికి రోగుల సంఖ్య పెరుగుతోంది. త్వరలో మరో ఐదు పడకల కేంద్రం ఏర్పాటు కోసం ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు.
జీవితం సాఫీగా..
చాలా కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాను. 2019 నుంచి సర్కారు దవా ఖానాలో ఏర్పాటు చేసి న డయాలసిస్ కేంద్రంలో చికిత్స పొందుతున్నాను. ఉచితంగా మెరుగైన సేవలు అందుతున్నాయి. ఆర్థిక సమస్య లేకుండా జీవితం సాఫీగా సాగుతోంది.
– సాల్మన్‌రెడ్డి, రోగి, ధన్నారం
వినియోగించుకోండి
కార్పొరేట్ స్థాయిలో ఉచిత సేవలను అందిస్తున్నాం. బాధితులు వినియోగించుకోండి. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.5 వేల నుంచి 10 వేల ఖర్చువుతుంది. ప్రస్తుతానికి రోజు 30 మంది కిడ్నీ బాధితులు వస్తున్నారు. 15 మందికి చికిత్స అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ కార్డు దారులకు ఉచిత సేవలు అందిస్తున్నాం.
– నవీన్, డయాలసిస్ కేంద్రం, ఇన్‌చార్జి, మహేశ్వరం
సౌకర్యాలు కల్పిస్తున్నాం
రోగులకు నిత్యం సేవలు అందిస్తున్నాం. రోజు మూడు షిప్టుల్లో 15 మందికి డయాలసిస్ చేస్తున్నాం. బాధితులకు సౌకర్య వంతంగా అన్ని వసతులను కల్పిస్తున్నాం. రోగుల సంఖ్య పెరిగితే పడకలు, యంత్రాలను పెంచుతున్నాం. మహేశ్వరం కేంద్రంలో కార్పొరేట్ స్థాయిలో సేవలు అందిస్తున్నాం.
– డాక్టర్ అమీర్ సిద్దిఖీ, సూపరిండెంటెండ్, మహేశ్వరం
బాధితులకు ఊరట
తగ్గిన దూర, ఆర్థిక భారం