
బైకు దొంగల అరెస్టు
● నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం
● వివరాలు వెల్లడించిన ఏసీపీ లక్ష్మీనారాయణ
షాద్‌నగర్‌రూరల్: ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైకులను దొంగతనం చేస్తున్న ఇద్దరు దుండగులను సోమవారం షాద్‌నగర్ పోలీసులు అరెస్టు, చేసి రిమాండ్‌కు తరలించారు. ఏసీపీ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూరు మండలం దావుడ్‌గూడ తండాకు చెందిన శివ, కొత్తూరు మండలం కొడిచర్ల గ్రామానికిచెందిన బ్యాగరి రాంచందర్‌లు స్నేహితులు. వీరు షాద్‌నగర్ ఠాణా పరిసర ప్రాంతాల్లోని ఇళ్ల ఎదుట పార్కింగ్ చేసిన బైకులను అపహరిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకిచెందిన వెంకటేశ్వర్లుకు చెందిన ద్విచక్ర వాహనం జూలై నెలలో చోరికి గురైంది. ఇదే విషయమై సదరు బాధితుడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బైకుదొంగలను గుర్తించారు. నిందితుల నుంచి సుమారు రూ.2 లక్షల విలువ చేసే 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని, వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా కేసు ఛేదించిన సీఐ విజయ్‌కుమార్, డీఎస్‌ఐ శివారెడ్డి, కానిస్టేబుళ్లు రవీందర్, సంతోష్, కరుణాకర్, జాకీర్‌లను ఏసీపీ అభినందించి, రివార్డులు అందజేశారు.