
కుంగిన ‘బావి’
శంకర్‌పల్లి: మండల పరిధిలోని జన్వాడలో గతంలో తాగునీటి కోసం ఉపయోగించే బావి నాలుగు రోజుల క్రితం కుంగింది. దీంతో అధికారులు అప్రమత్తమై.. దాని దగ్గరకు ఎవరూ వెళ్లకుండా చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. బావి పక్కన విద్యుత్ స్తంభం కోసం గుంతను తవ్వి, దానిని నిలబెట్టారని, అది క్రమంగా భారీ గుంతగా మారి విద్యుత్ స్తంభం నెలకొరిగిందని గ్రామస్తులు తెలిపారు. దీంతో పక్కనే ఆనుకొని ఉన్న బావి సైతం కుంగిందని పేర్కొన్నారు. ఏళ్లనాటి బావి కుంగడంపై ఆ గ్రామస్తులు ఆశ్ఛర్యం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే దానిని పునరుద్ధరించాలని అధికారులను కోరుతున్నారు.