లోటులోనే లోతులోనే | - | Sakshi
Sakshi News home page

లోటులోనే లోతులోనే

Sep 8 2025 9:39 AM | Updated on Sep 8 2025 9:39 AM

లోటులోనే లోతులోనే

లోటులోనే లోతులోనే

సోమవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025 న్యూస్‌రీల్‌ 8లోu

ఈ ఏడాది జూన్‌ నుంచి సెప్టెంబర్‌ 7 వరకు నమోదైన వర్షపాతం (సెంటీ మీటర్లలో)

ఆరేళ్లలో నమోదైన వర్షపాతం

(సెంటీ మీటర్లలో..)

సోమవారం శ్రీ 8 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025
న్యూస్‌రీల్‌

సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లాలో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతంనమోదైంది. వికారాబాద్‌ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఈసీ, మూసీ వాగులు పొంగిపొర్లాయి. జంటజలాశయాలైన హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌కు వరద పోటెత్తింది. కడ్తాల్‌, మాడ్గుల, యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, జిల్లెడు చౌదరిగూడ, హయత్‌నగర్‌, గండిపేట మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఆయా మండలాల్లో ఇప్పటికీ పలు చెరువులు, కుంటలు నీళ్లు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుకు ఆశించిన స్థాయిలో నీరు చేరక వెలవెలబోతోంది. ఎగువ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడానికి తోడు వరదనీటిని మోసుకొచ్చే కాల్వలు, గొలుసు కట్టు చెరువులు, కుంటలు ధ్వంసం కావడమే ఇందుకు కారణం. జిల్లాలో 2,100పైగా చెరువులు, కుంటలు ఉండగా, వీటిలో సగానికి పైగా నీళ్లు లేక వెలవెలబోతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఆశించిన స్థాయిలో వర్షాలు లేక..

కడ్తాల్‌ మండలంలో సాధారణం కంటే అతి తక్కువగా 47.18 సెం.మీ వర్షపాతం నమోదు కాగా, మాడ్గులలో 48.60, యాచారంలో 49.95, మంచాలలో 50.93 సెం.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. గత ఏడాది జిల్లాలో నమోదైన వర్షపాతంతో పోలిస్తే ఈ ఏడాది చాలా తక్కువ నమోదైంది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో భూగర్భ జలాలు ఇప్పటికీ పాతాళానికే పరిమితమయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలం ఫీజో మీటర్‌లో 18 మీటర్ల లోతులో నీటి ఆనవాళ్లు కన్పించగా, మంచాల మండలంలో 12.14 మీటర్ల లోతుకే పరిమితమయ్యాయి. ఇక శంకర్‌పల్లి మండలంలో 10.99 మీటర్ల లోతులో నీటి ఆనవాళ్లు లభ్యం కాగా, తలకొండపల్లిలో 10.88 మీటర్ల లోతులో ఉన్నాయి. యాచారం మండలంలో 10.64 మీటర్ల లోతుకు పరిమితమయ్యాయి. ఏకధాటి వర్షాలు, భారీ వరదలు పోటెత్తినప్పటికీ జిల్లాలోని భూగర్భజల మట్టం ఆశించిన స్థాయిలో పైకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు నందిగామ, ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం, కేశంపేట, కందుకూరు, బాలాపూర్‌, చౌదరిగూడెం, చేవెళ్ల ఫీజో మీటర్లలో మాత్రం నాలుగు మీటర్ల లోతులోనే నీటి ఆనవాళ్లు కన్పిస్తుండటం విశేషం.

కనిపించని ఆనవాళ్లు

జిల్లాలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు

ఇంకా 12.09 సెంటీమీటర్ల లోటు

పాతాళంలోనే గంగమ్మ

అడుగునే భూగర్భ జలాలు

బోసిపోయిన పలు చెరువులు, కుంటలు

మాసం సాధారణం నమోదైంది

జూన్‌ 9.72 7.38

జూలై 14.43 22.18

ఆగస్టు 15.33 31.64

సెప్టెంబర్‌ 3.00 0.95

సంవత్సరం సాధారణం నమోదైంది

2022–21 69.46 122.52

2021–22 69.46 95.35

2022–23 69.46 112.20

2023–24 72.58 72.19

2024–25 72.58 93.74

2025–26 75.05 62.15

అప్పుడే కరువు ఛాయలు

మంచాల మండలంలో 23 గ్రామాలు ఉండగా, వీటిలో ఆరుట్ల, మంచాల మినహా ఇతర గ్రామాల్లోని చెరువులు, కుంటలకు చుక్క నీరు చేరలేదు. ఇక్కడి రైతులు పూర్తిగా వర్షాధారంపైనే ఆధారపడుతుంటారు. బోరుబావులు కూడా సరిపడా నీరు పోయక పోవడంతో వరినాట్లకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. గతంలో రెండు మూడు ఎకరాల్లో వరి సాగు చేసిన రైతులు ప్రస్తుతం అర ఎకరం, ఎకరానికే పరిమితమయ్యారు. వినాయక చవితి వేడుకల్లో ఘనంగా పూజలు అందుకున్న గణనాథుల నిమజ్జనం కోసం ఇబ్బంది పడాల్సి వచ్చింది. విధిలేని పరిస్థితుల్లో నాగార్జున సాగర్‌ ఇతర ప్రాజెక్టుల వద్దకు తీసుకెళ్లాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోచ్చు. తాళ్లపల్లిగూడలో చెరువులో నీళ్లు లేక చెరువు మధ్యలో భారీ గుంత తవ్వి అందులో వినాయక విగ్రహాన్ని ఉంచి, బోరు నీటితో నింపి నిమజ్జనం చేయాల్సి వచ్చింది. అదేవిధంగా జాపాలలోని మధ్యకుంటలోకి ఇప్పటి వరకు చుక్కనీరు చేరలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement