మాంసం ముట్టరు! వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం వాల్యానాయక్‌తండాలో కొనసాగుతున్న ఆచారం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. | - | Sakshi
Sakshi News home page

మాంసం ముట్టరు! వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం వాల్యానాయక్‌తండాలో కొనసాగుతున్న ఆచారం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Sep 7 2025 8:35 AM | Updated on Sep 7 2025 8:35 AM

మాంసం

మాంసం ముట్టరు! వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం వాల్యాన

మాంసం ముట్టరు! వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం వాల్యానాయక్‌తండాలో కొనసాగుతున్న ఆచారం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆదివారం శ్రీ 7 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025 8లోu

న్యూస్‌రీల్‌

బాలాపూర్‌ టు హుస్సేన్‌సాగర్‌

లడ్డూ అధరహో

బాలాపూర్‌ గణేశుడి శోభాయాత్ర

జై.. బై గణేశా

ప్రశాంతంగా నిమజనోత్సవం

సాక్షి, రంగారెడ్డిజిల్లా: గణేశ్‌ నిమజ్జనోత్సవం శనివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజించిన గణనాథులను మేళ తాళాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి సమీపంలోని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. చిన్నారులు, యువతీ, యువకులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. జై బోలో గణేశ్‌ మహరాజ్‌కీ..జై .. గణపతి బొప్పా మోరియా.. అంటూ హోరెత్తించారు. మండపాల వద్ద వేలం పాటలు హోరాహోరీగా సాగాయి. లడ్డూ ప్రసాదాన్ని చేజిక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. సరూర్‌నగర్‌ మినీట్యాంక్‌బండ్‌, తుర్కయంజాల్‌ మాసబ్‌ చెరువు సహా జిల్లా వ్యాప్తంగా 44 చెరువులు, కుంటలను నిమజ్జనం కోసం ఎంపిక చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఉదయం ఐదు గంటలకే ..

ఉదయం ఐదు గంటలకే బాలాపూర్‌ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత వాహనంపై విగ్రహాన్ని ఉంచి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఉదయం 9.30 గంటలకు బొడ్రాయి వద్దకు చేరుకుంది. 10.44 గంటలకు వంగేటి లక్ష్మారెడ్డి లడ్డూ వేలం పాట ప్రారంభించారు. ఆరు నిమిషాల పాటు జోరుగా సాగిన వేలం పాటలో కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్‌గౌడ్‌ రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. ఆయన ఆరేళ్లుగా వేలం పాటలో పాల్గొంటుండగా ఈ ఏడాది వరించింది. గత ఏడాది వేలం పాటలో లడ్డూను దక్కించుకున్న కొలను శంకర్‌ రెడ్డి రూ.30.01 లక్షలను ఉత్సవ కమిటీకి అందజేశారు. అనంతరం లడ్డూను దక్కించుకున్న దశరథగౌడ్‌ను గుర్రపు బండిలో ఎక్కించుకుని మేళతాళాలతో ఊరేగించి హనుమాన్‌ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రత్యేక పూజలు, వేలం పాట పూర్తయిన తర్వాత ఉదయం 11.30 గంటలకు శోభాయాత్ర మొదలైంది. అశేషభక్త జనం వెంటరాగా గణనాథుడి వాహనం ముందుకు కదిలింది. మల్లాపూర్‌, చంపాపేట్‌, పాతబస్తీ సహా ఇతర ప్రాంతాల్లో నెలకొల్పిన విగ్రహాలు అనుసరించాయి. శోభాయాత్ర మధ్యాహ్నం 2 గంటలకు చాంద్రాయణగుట్టకు చేరుకుంది. అటు నుంచి మధ్యాహ్నం 3.10 గంటలకు చార్మినార్‌.. 3.56 గంటలకు ఎంజే మార్కెట్‌కు చేరింది. సాయంత్రం 4.30కు బషీర్‌బాగ్‌ దాటింది. 5.30 గంటలకు ట్యాంక్‌ బండ్‌ చేరుకుంది. సరిగ్గా 5.50 గంటలకు నిమజ్జన ప్రక్రియ పూర్తయింది. బాలాపూర్‌ గణేశుడికి దారి పొడవునా భక్తులు నీరాజనం పలికారు. భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చార్మినార్‌ సహా పలు కూడళ్లలో స్వాగతం పలికారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తి కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

బాలాపూర్‌ వినాయకుడి లడ్డూను కర్మన్‌ఘట్‌కు చెందిన లింగాల దశరథగౌడ్‌ రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి రూ.4.99 లక్షలు అదనంగా పలకడం విశేషం.

చేవెళ్ల రచ్చబండ వినాయక లడ్డూను రూ.16,11,001కు అత్తెల్లి బ్రదర్స్‌ దక్కించుకున్నారు.

చేవెళ్ల మండలం ఖానాపూర్‌లో చేకూరి అంజిరెడ్డి రూ.9.50 లక్షలకు గణపతి లడ్డూను సొంతం చేసుకున్నారు.

రాగన్నగూడలో ఏర్పాటు చేసిన గణేశుడి లడ్డూను రూ.7.65 లక్షలకు రొక్కం భీంరెడ్డి దంపతులు దక్కించకున్నారు.

తుక్కుగూడ బొడ్రాయి ఉత్సవ కమిటీ గణేశుడి లడ్డూను రూ.7,55,111కు ప్రకాష్‌రెడ్డి కై వసం చేసుకున్నారు.

శంకర్‌పల్లి మండలం మాసానిగూడ హనుమాన్‌ మందిర్‌ గణేశ్‌ లడ్డూను రూ.7,20,000కు కురుమ సంఘం ఉపాధ్యక్షుడు శ్రీశైలం కై వసం చేసుకున్నారు.

బడంగ్‌పేట వీరాంజనేయ భక్తసమాజం గణనాథుడి లడ్డూను రూ.7.10 లక్షలకు గౌర సత్తయ్య కుటుంబ సభ్యులు దక్కించుకున్నారు. గత ఏడాది ఇదే లడ్డూ రూ.17 లక్షలు పలకడం విశేషం. గతంతో పోలిస్తే ఈసారి రూ.9.90 లక్షలు తక్కువకు ధర పలికింది.

మొయినాబాద్‌ మున్సిపాలిటీ ఎన్కేపల్లిలోని వినాయకుడి లడ్డూను రూ.6.50 లక్షలకు ముదిగొండ ప్రభాకర్‌యాదవ్‌ దక్కించకున్నారు.

ఆదిబట్ల మున్సిపల్‌ పరిధిలోని బురుజు వద్ద వినాయకుడి లడ్డూను రూ.6.50 లక్షలకు మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్‌ పర్సన్‌ కోరె కలమ్మ జంగయ్య దక్కించుకున్నారు.

చేవెళ్లలోని జర్నలిస్టు కాలనీలో జేసీ యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక లడ్డూ ప్రసాదాన్ని రూ.6,06,666కు కోణార్క్‌ గ్రూప్‌ సభ్యులు కాసుల ఆనంద్‌ గౌడ్‌, కిష్టమొళ్ల త్రినేత్ర దక్కించుకున్నారు.

చకచకా సాగిన బాలాపూర్‌ శోభాయాత్ర

దారి పొడవునా భక్తుల నీరాజనం

పాతబస్తీ మీదుగా హుస్సేన్‌సాగర్‌కు చేరిన గణేశుడు

సరూర్‌నగర్‌, తుర్కయంజాల్‌ మాసబ్‌చెరువుల వద్ద కోలాహలం

పోటాపోటీగా లడ్డూ వేలం పాటలు

బాలాపూర్‌ లడ్డూ రూ.35 లక్షలు

మాంసం ముట్టరు! వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం వాల్యాన1
1/6

మాంసం ముట్టరు! వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం వాల్యాన

మాంసం ముట్టరు! వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం వాల్యాన2
2/6

మాంసం ముట్టరు! వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం వాల్యాన

మాంసం ముట్టరు! వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం వాల్యాన3
3/6

మాంసం ముట్టరు! వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం వాల్యాన

మాంసం ముట్టరు! వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం వాల్యాన4
4/6

మాంసం ముట్టరు! వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం వాల్యాన

మాంసం ముట్టరు! వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం వాల్యాన5
5/6

మాంసం ముట్టరు! వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం వాల్యాన

మాంసం ముట్టరు! వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం వాల్యాన6
6/6

మాంసం ముట్టరు! వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం వాల్యాన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement