
ప్రజలకు చేరువగా న్యాయసేవలు
చేవెళ్ల: ప్రజలకు న్యాయసేవలను మరింత చేరువ చేసేందుకే అడిషనల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి అభినంద్ కుమార్ శావిలి అన్నారు. మండలకేంద్రంలో అడిషనల్ జూనియర్ సివిల్‌కోర్టును శనివారం ఆయన జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కరుణకుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడిషనల్ కోర్టులతో ప్రజలకు సత్వర న్యాయం అందించే వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు న్యాయమూర్తి ప్రదీప్ నాయక్, చేవెళ్ల జూనియర్ సివిల్ జడ్జి దశరథరామయ్య, జూనియర్ జడ్జి వినోద్‌కుమార్ ఉపాధ్యాయ, ఎమ్మెల్యే కాలె యాదయ్య, చేవెళ్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహేశ్వరంలో సీనియర్ సివిల్ కోర్టు
మహేశ్వరం: మండల కేంద్రంలోని ప్రభుత్వ అతిథి గృహంలో సీనియర్ సివిల్ కోర్టును శనివారం హైకోర్టు న్యాయమూర్తి అభినంద్ కుమార్ శావిలి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయ రక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి విజయ్‌సేన్‌రెడ్డి, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి కరుణ కుమార్, 15వ జిల్లా అదనపు కోర్టు న్యాయమూర్తి ప్రదీప్ నాయక్, మహేశ్వరం సీనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి రీటాలాల్ చంద్, జూనియర్ కోర్టు న్యాయమూర్తి అపర్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్.హరికిషన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి అభినంద్ కుమార్ శావిలి