
పింఛన్లు పెంచకుంటే యుద్ధమే
ఇబ్రహీంపట్నం: వికలాంగుల, చేయూత పింఛన్లు పెంచకుంటే ప్రభుత్వంపై యుద్ధం తప్పదని వీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య హెచ్చరించారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ముఖ్యనేతల సమావేశం శనివారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలదివ్యాంగులకు రూ.4వేల నుంచి రూ.6 వేలకు, వితంతు, ఒంటరి మహిళకు రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పింఛన్లు పెంచుతామని కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. పింఛన్లు పెంచే వరకు పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా సోమవారం కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తున్నామని, కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరుకానున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జి యాదిగిరి మాదిగ, వీహెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున శ్రీనివాస్‌చారి, జిల్లా అధ్యక్షుడు యాచారం జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఐదేళ్లుగా అన్యాయం
మంచాల: ఐదేళ్లుగా పాలక ప్రభుత్వాలు కొత్త పింఛన్లు ఇవ్వక పోవడం దారుణమని వీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కాళ్ల జంగయ్య అన్నారు. మండల కేంద్రంలో శనివారం దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పింఛన్లు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.
వీహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య