
యూరియా.. క్యూ తప్పదయా
మొయినాబాద్: రైతులకు యూరియా కష్టాలు తప్పడంలేదు. సురంగల్–మొయినాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 450 బస్తాలు రావడంతో శనివారం పంపిణీ చేశారు. యూరియా వచ్చిందని తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంట ల నుంచే మొయినాబాద్ రైతు వేదిక వద్ద బారులు తీరారు. అధికారులు రాకముందే చెప్పులు లైన్లో పెట్టారు. వ్యవసాయాధికారులు రైతువేదిక వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా ఎగబడ్డారు. గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో పోలీసులు క్యూ కట్టించారు. మండల వ్యవసాయాధికారి అనురాధ రైతులకు టోకెన్లు రాసి ఇచ్చారు. టోకెన్లు తీసుకున్న రైతులు పీఏసీఎస్ కార్యాలయం వద్దకు వెళ్లి బారులు తీరారు. అక్కడ పీఏసీఎస్ చైర్మన్ చంద్రారెడ్డి, డైరెక్టర్ జగన్‌మోహన్‌రెడ్డి, సీఈఓ మనోహర్‌రెడ్డి దగ్గరుండి రైతులకు యూరియా అందజేశారు. టోకెన్లు తీసుకుని మిగిలిపోయిన రైతులకు మంగళవారం స్టాక్ వచ్చిన తరువాత ఇస్తామని వివరించారు.