
దివ్యాంగుల హామీలు అమలు చేయాలి
కొత్తూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు దివ్యాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేందర్‌మాదిగ డిమాండ్ చేశారు. మండలంలోని ఇన్ముల్‌నర్వలో గురువారం ఎమ్మార్పీఎస్, దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచని పక్షంలో ఈ నెల 8న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి పట్టనట్లు వ్యవహరించడం సీఎం రేవంత్‌రెడ్డికి తగదన్నారు. పెన్షన్ల అంశంలో ప్రభుత్వం, సీఎం స్పందించని పక్షంలో ఈ నెల 8న కలెక్టరేట్లు, 12న తహసీల్దార్ కార్యాలయాలు, 20న హైదరాబాద్–విజయవాడ రహదారి దిగ్భందం చేయడంతో పాటు 21 నుంచి 26 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో ధర్నాలు, 27న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులపై ధర్నాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికై నా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నేతలు కోళ్ల శివ, రావుగళ్ల బాబు, శంకర్‌రావు, పెంటనోళ్ల రవికుమార్, రవి, రమేశ్, కృష్ణ, అశోక్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉపేందర్