
కర్షకుల యూరియా కష్టాలు తీర్చాలి
బీఆర్‌ఎస్ నాయకుల డిమాండ్
ఆమనగల్లు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అవసరమైన యూరియాను అందించి, ఆదుకోవాలని బీఆర్‌ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు పత్యానాయక్ డిమాండ్ చేశారు. గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. యూరియా కొరతకు కారణం మీరంటే మీరంటూ విమర్శలు చేసుకుంటున్నాయని, కానీ రైతుల కష్టాలు తీర్చడం లేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో వ్యవసాయం పండుగలా సాగిందని, రైతులకు చిన్నకష్టం రానివ్వలేదని గుర్తుచేశారు. రోడ్లన్నీ తానే తెచ్చానని చెప్పుకుంటున్న స్థానిక నాయకుడు ఒకరు.. కేంద్రంతో మాట్లాడి యూరియా తీసుకురావాలని హితవు పలికారు. అనంతరం డీటీ వినోద్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిరంజన్‌గౌడ్, మాజీ ఎంపీటీసీ పంతునాయక్, వార్డు మాజీ సభ్యుడు వస్పుల సాయిలు, నాయకులు రమేశ్, మహేశ్, గణేశ్, జగన్, పంతునాయక్, సోమ్లనాయక్, శ్రీకాంత్, గణేశ్‌నాయక్, కృష్ణవేణి, లలిత, విమలమ్మ తదితరులు పాల్గొన్నారు.