
డీజే వాడిన ఏడుగురిపై కేసు
● పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అభియోగం
● డీజేతో పాటు వాహనం సీజ్
● ఇబ్రహీంపట్నం కోర్టులో అప్పగింత
యాచారం: పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఏడుగురిపై కేసు నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. యాచారం అనుబంధ గ్రామమైన మొగుళ్లవంపులో బుధవారం రాత్రి హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో గణేశ్ నిమజ్జనం నిర్వహించారు. ఈ సందర్భంగా బండ శ్రీనివాస్‌రెడ్డి, గౌరారం లింగారెడ్డి, నందీశ్వర్‌రెడ్డి, రేసు రాము, పట్టణ చంద్రశేఖర్‌రెడ్డి, మూడేడ్ల శ్యాంసుందర్, నాయిని వెంకట్‌రెడ్డి డీజే పెట్టి, ఎక్కువ సౌండ్‌తో రోడ్డుపై రాకపోకలు సాగించే ప్రజలకు ఇబ్బంది కలిగించారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగి, వారి విధులకు ఆటంకం కలిగించారు. ఈ విషయమై కేసు నమోదు చేసిన పోలీసులు డీజేతో పాటు వాహనాన్ని సీజ్ చేసి, ఇబ్రహీంపట్నం కోర్టులో అప్పగించినట్లు సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలి పారు. వినాయక నిమజ్జన కార్యక్రమంలో డీజేలను వాడొద్దని సూచిస్తున్నా కొంతమంది ప్రజలకు ఇబ్బ ందులు కలిగిస్తున్నారని, పద్ధతి మార్చుకోకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.