
యూరియా కలిపిన నీళ్లు తాగి కాడెద్దు మృతి
షాబాద్: యూరియా కలిపిన నీళ్లు తాగి కాడెద్దు మృతి చెందిన ఘటన గురువారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పశుఽవైద్యాధికారి డాక్టర్ స్రవంతి తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్‌కు చెందిన దొండ్ర కృష్ణకు చెందిన రెండు కాడెడ్లు 25 కేజీల యూరియా కలిపిన నీళ్లు తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. వెంటనే గమనించిన రైతు చికిత్స నిమిత్తం స్థానిక వెటర్నరీ ఆస్పత్రికి తరలించగా వైద్యం చేస్తుండగానే ఓ ఎద్దు మృతిచెందింది. చికిత్స చేయడం ద్వారా మరో ఎద్దు ప్రాణాలతో బయటపడిందని సిబ్బంది శ్రీకాంత్, కృష్ణమూర్తి, బాలమణి తెలిపారు.