
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఆమనగల్లు: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీఐటీయూ ఆమనగల్లు ఏరియా కన్వీనర్ పెంటయ్య డిమాండ్ చేశారు. పట్టణంలో బుధవారం మండల గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గ్రామ పంచాయతీ కార్మికులకు రూ.18 వేలు అందించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. అనంతరం ఎంపీడీఓ కుసుమ మాధురికి సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్షులు పాండు, కార్యదర్శి పర్వతాలు, కోశాధికారి లక్ష్మణ్‌నాయక్, సభ్యులు భాగ్యనాయక్, దోడ్యనాయక్, భాగ్య, కవిత, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం మహాసభ నిర్వహించారు. మహాసభలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షురాలిగా పద్మ, అధ్యక్షురాలిగా రజియాబేగం, ప్రధాన కార్యదర్శిగా ఈశ్వరమ్మ, కోశాధికారిగా బేబి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ ఆమనగల్లు ఏరియా
కన్వీనర్ పెంటయ్య